వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ లు ... లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి

|
Google Oneindia TeluguNews

అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలు చెప్పిన చిన్నారులు అంతలోనే కానరాని లోకాలకు చేరిపోతున్నారు. చాలా సందర్భాల్లో లిఫ్టులు పాలిట మృత్యు కుహరాలు గా మారుతున్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపు విగతజీవులుగా చిన్నారులు మారిపోతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. సరిగ్గా అటువంటి ఘటనే మేడ్చల్ లో జరిగింది.

మేడ్చల్ లోని బాలాజీ నగర్ అపార్ట్ మెంట్ లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని 10 సంవత్సరాల బాలుడు మరణించాడు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న బాల చందర్ కుమారుడు హేమంత్ కుమార్ స్కూల్ నుంచి వచ్చాడు. ఆడుకుంటు..ఆడుకుంటు లిఫ్ట్ ఎక్కిన సమయంలో గ్రిల్ లో ఇరుక్కున్న హేమంత్ కుమార్ తల ఇరుక్కుపోయి ఊరిపి ఆడక మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన హేమంత్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై అపార్ట్ మెంట్ వాసులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం హేమంత్ కుమారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Lifts as death zones .. The boy died in the lift.

లిఫ్ట్‌లు చాలా సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. బహుళ అంతస్తులు ఉండే అపార్ట్‌మెంట్స్, షాపింగ్‌ మాల్స్‌లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులు ఉన్న అపార్ట్ మెంట్ లలో పిల్లలు లిఫ్ట్ తో ఆటలాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పుడు గమనిస్తూ ఉండాలి . లేకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.

English summary
10-Year-Old Boy Dies After Getting Trapped In Lift in an apartment in Balaji Nagar, Medchal. 10-year-old Hemant Kumar was stucked in a lift while he is playing a game .His head was trapped in the lift grill and he did not breathe and died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X