వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరట: క్యాష్ విత్ డ్రాపై పరిమితి ఎత్తివేత, కానీ..

నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది. తాజాగా, సోమవారం నాడు మరో ప్రకటన చేసింది. సామాన్యుడికి ఊరటనిచ్చే ప్రకటన చేసింది.

rbi

ఎల్లుండి.. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నగదు ఉపసంహరణ పైన పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, సేవింగ్స్ ఖాతాకు సంబంధించి మాత్రం వారానికి రూ.24వేల నగదు పరిమితిని కొనసాగించాలని నిర్ణయించింది.

కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చే వరకు అన్ని బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించారు.

చెక్‌ ద్వారా వారానికి రూ.24వేలు, ఏటీఎంల నుంచి రూ.2వేలు మాత్రమే తీసుకునేలా నిబంధన విధించారు. ఆ కొత్త నోట్ల చలామణి నెమ్మదిగా పెరగడంతో ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4500కు పెంచారు. ఇటీవల ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచారు.

English summary
RBI on Monday announced that the limits placed on cash withdrawals from ATMs stand withdrawn from Feb 01.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X