వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.10 వేల కోట్ల నుంచి రూ.21 వేలకు ఆదాయం, లిక్కర్ వల్లే నేరాలు పెరిగాయి, గవర్నర్‌తో భట్టి

|
Google Oneindia TeluguNews

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడమే నేరాలకు కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు యువతను పెడదోవ పట్టిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ నాయకుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందని మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు మహిళలపై దాడి, మద్య నియంత్రణపై ఫిర్యాదు చేశారు.

హీరో రజనీకాంత్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటిహీరో రజనీకాంత్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటి

 ఆదాయ వనరుగా..

ఆదాయ వనరుగా..

మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. వ్యాపారాత్మక ధోరణితోనే ప్రవర్తిస్తుందని చెప్పారు. మద్యంపై రూ.10 వేల ఆదాయం వచ్చేందని గుర్తుచేశారు. కానీ దానిని తమ రాబడిగా భావించి రూ.21 వేలకు పెంచుకున్నారే తప్ప యువద పెడదోవ పట్టేందుకు కారణం అవుతున్నామనే విషయాన్ని మరచిపోయారన్నారు.

ఏరులైపారుతున్నమద్యం

ఏరులైపారుతున్నమద్యం

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో యువత మత్తులో జోగుతుందని.. ఆయా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్: షాపులను ఎత్తివేయాలని భట్టి విక్రమార్క గవర్నర్‌ను కోరారు. అలాగే రహదారులపై ఉన్న మద్యం షాపులను మూసివేయాలని స్పష్టంచేశారు. లేదంటే మద్యం సేవించి, మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా కొందరు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు.

పోలీసులకు సంకెళ్లు..

పోలీసులకు సంకెళ్లు..

ప్రజల ధన, మాన ప్రాణాలను సంరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ నేతల కబందహస్తాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పోలీసులను తమ సొంత పనులకు నేతలు వాడుకుంటున్నారని చెప్పారు. దీంతో పోలీసులు కూడా స్వేచ్చగా పనిచేసే వీలులేదని ఆరోపించారు. హత్యలు, లైంగికదాడులు జరిగి.. రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోతుందని చెప్పారు. దిశ కనిపించట్లేదని పేరెంట్స్ చెబితే తమ పరిధిలోకి రాదని వారు చెప్పడం సరికాదని ఖండించారు.

చొరవ తీసుకొండి

చొరవ తీసుకొండి

రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై దాడులు, మద్య నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో మరిన్ని దిశ లాంటి ఘటనలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

English summary
liquor revenue increase in state 1o k crore to 21k crores clp leader bhatti vikramarka said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X