వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో సాహిత్య సందడి (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన 29వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. శుక్రవారం క్రిస్మస్ సెలవు కావడంతో బుక్ ఫెయిర్ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. పలువురు రచయితలు తమ పుస్తకాలను బుక్ ఫెయిర్‌లోనే ఆవిష్కరిస్తున్నారు.

2014లో పలువురు రచించిన కథల్లో నుంచి ఎంపిక చేసిన 14 ఉత్తమ కథలను పొందుపర్చుతూ సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబా, వెల్దండి శ్రీధర్ సంపాదకీయం చేసిన తన్లాట తెలంగాణ కథలు-2014 పుస్తకాన్ని సీనియర్ ప్రాతికేయులు రామచంద్రమూర్తి ఆవిష్కరించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో సుద్ధాల హనుమంత్ వేదిక వద్ద కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో కవులు ఆచార్య ఎన్.గోపి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సుభద్ర, ఆమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకర్, శివ కుమార్, వీఆర్.శర్మ, పత్తిపాక మోహన్, స్కైబాబా, ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, కాసుల ప్రతాప్‌రెడ్డి, సుబ్బయ్య, రఘు, జనజ్వాల, కాశీం తదితరులు పాల్గొని కవిత్వాలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు కవులకు జ్ఞాపికలను అందజేశారు.

అలాగే, వ్యక్తిత్వ వికాసం నిపుణుడు పట్టాభిరామ్ రచించిన వినర్స్ మంత్రాస్ పుస్తకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఆవిష్కరించారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి, ఎమ్మెస్కో పబ్లిషర్స్ సంస్థ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తన్లాట పుస్తకావిష్కరణ

తన్లాట పుస్తకావిష్కరణ

తన్లాట పుస్తకావిష్కరణ కవి రచయిత నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్ పాల్గొన్నారు.

కాశీం పుస్తకావిష్కరణ

కాశీం పుస్తకావిష్కరణ

కవి రచయిత కాశీం రచించిన తెలంగాణ సాహిత్యం అనే పుస్తకాన్ని ప్రజా గాయకుడు గద్దర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీక్షణం సంపాదకులు వేణు గోపాల్ పాల్గొన్నారు.

కోదండరామ్..

కోదండరామ్..

రచయిత స్కైబాబా తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించిన వెజిటేరియన్ ఓన్లీ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యఅతిథిగా ఆవిష్కరించారు. అలాగే, రచయిత గంప శ్రీనివాస్ రచించిన లక్ష మాటలు అనే పుస్తకాన్ని కూడా కోదండరాం ఆవిష్కరించారు.

స్టాల్స్‌ను సందర్శిస్తూ కోదండరామ్

స్టాల్స్‌ను సందర్శిస్తూ కోదండరామ్

తెలంగాణ రాజకీయజెఎసి చైర్మన్ కోదండరామ్ శుక్రవారంనాడు హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో స్టాళ్లను సందర్శించారు.

కాంపిటీటివ్ బుక్స్‌కు భలే గిరాకీ...

కాంపిటీటివ్ బుక్స్‌కు భలే గిరాకీ...

టిఎస్‌పిఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కాంపిటీటివ్ పుస్తకాలకు బుక్ ఫెయిర్‌లో విపరీతమైన గిరాకీ ఉంది.

ఇతర పుస్తకాలపై కూడా ఆసక్తి...

ఇతర పుస్తకాలపై కూడా ఆసక్తి...

తమకు నచ్చిన పుస్తకాలను ఏరుకోవడంలో పాఠకులు విపరీతమైన ఆసక్తి ప్రదర్శించారు. స్టాళ్లలో పుస్తకాలను చూస్తూ ఇలా..

English summary
hyderabad book fair is attracting readers in big manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X