వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడుకొనే సమయం తగ్గించిందని నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

తనకు ఆడుకొనే సమయాన్ని బాగా తగ్గించిందని తన నానమ్మపై ఓ బాలుడు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :చిన్న పిల్లాడు ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు . తనను ఆడుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని ఆయన తన నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పోలీసులను పట్టుబట్టాడు.

ఉదయం పూట కాదు ఏకంగా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కువచ్చి మరీ పోలీసులకు చుక్కలు చూపించాడు ఆ బుడతడు. అయితే పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

little boy complient against his grandmother in police station

తనను ఆరుబయట ఆడుకోకుండా తన నానమ్మ అడ్డుకొంటోందని ఆ బాలుడు ఆరోపించాడు. ఈ మేరకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. తన పిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయాలని ఆ బాలుడు పట్టుబట్టడంతో పోలీసులు ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ ఆర్ నగర్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తోన్న వ్యక్తి కొడుకు తన నానమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనను ఆడుకోకుండా తన సమయాన్ని తగ్గిస్తోందని ఆమెపై ఆరోపణలు చేశాడు. అయితే తన కొడుకుపై సీరియళ్ళ ప్రభావం కన్పిస్తోందని బాలుడి తండ్రి చెప్పారు. పోలీసులు బాలుడికి చాక్లెట్లు ఇచ్చి అతన్ని సముదాయించారు.పోలీసుల హమీతో బాలుడు తన పిర్యాదును ఉపసంహరించుకొన్నాడు.

English summary
a little boy complient against his grand mother accusing her of torture after she reduced his playtime
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X