మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దూసుకెళ్లోంది. మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేసింది. విపక్ష కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కార్పొరేషన్లో ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అధికార పార్టీని గెలిపిస్తే పట్టణ/నగరాల అభివృద్ధి సాధ్యమని ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్పందించినట్టు కనిపిస్తోంది. అయితే నారాయణ ఖేడ్, యాదాద్రి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవడాన్ని మాత్రం గులాబీ దళం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే టీఆర్ఎస్ దారిదాపుల్లో ఏ పార్టీ కూడా నిలవని సిచుయేషన్ నెలకొంది.
Newest FirstOldest First
5:35 PM, 25 Jan
ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు
ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు.. కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి.. కేసీఆర్
5:33 PM, 25 Jan
ఆల్ ఇండియా రికార్డ్
మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఆల్ ఇండియా రికార్డ్: కేసీఆర్
5:16 PM, 25 Jan
ఎన్నికల్లో అక్రమాలు
ఎన్నికల్లో అక్రమాలు.. భారీగా టీఆర్ఎస్ డబ్బు ఖర్చు చేసింది.. లక్ష్మణ్
4:46 PM, 25 Jan
నిజామాబాద్‌లో ఉత్కంఠ
నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. బీజేపీ 15 స్థానాల్లో, ఎంఐఎం 8, టీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలుపు..
3:17 PM, 25 Jan
ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తున్న కేటీఆర్
తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.#TelanganaWithKCRpic.twitter.com/zCkakMmTRX
తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
My heartfelt gratitude to the people of Telangana for reposing faith in Sri KCR Garu’s leadership again & giving us a thumping victory in Municipal elections 🙏 🙏🙏
Winning more than 100 plus municipalities out of 120 and all 9 out of 9 municipal corporations is no mean feat 👍 pic.twitter.com/sKIA0D71GU
మున్సిపల్ ఎన్నికల్లో శ్రీ కేసీఆర్ నాయకత్వంపై అశేష విశ్వాసాన్ని పెట్టుకొని అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు నా ధన్యవాదాలు. 120 మున్సిపాలిటిలలో 100కుపైగా గెలుచుకోవడం లాగే 9 కార్పోరేషన్లలో 9 గెలుచుకోవడం అరుదైన ఫీట్.
3:08 PM, 25 Jan
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో తిరుగులేని ఫలితాలు
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
3:05 PM, 25 Jan
టీఆర్ఎస్దే గెలుపు
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్దే గెలుపు అని మరోసారి ప్రజలు రుజువు చేశారు.. ట్విట్టర్లో హరీష్ రావు
1:24 PM, 25 Jan
భైంసా విజయంతో ఖాతా తెరిచిన ఎంఐఎం
1:13 PM, 25 Jan
ఏడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జయకేతనం
1:10 PM, 25 Jan
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
1:05 PM, 25 Jan
యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
12:52 PM, 25 Jan
మంథనిలో టీఆర్ఎస్ జయభేరీ. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పుట్టా శైలజాతో టీఆర్ఎస్ వార్డు సభ్యులు గుండా విజయలక్ష్మీ (1వ వార్డు) కుర్ర లింగయ్య (4వ వార్డు) కాయితి సమ్మయ్య (6వ వార్డు) గరపెళ్లి సత్యనారాయణ (7వ వార్డు), కొట్టే పద్మ (8వ వార్డు) వడ్లకొండ రవి (11వ వార్డు), వేముల లక్ష్మి (12వ వార్డు)
12:44 PM, 25 Jan
తొర్రూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం
12:42 PM, 25 Jan
ఆలేరు, నర్సంపేట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జయభేరీ
12:41 PM, 25 Jan
చొప్పదండి, పెబ్బేరు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం
12:38 PM, 25 Jan
మున్సిపోల్స్‌పై ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్న కేసీఆర్
12:38 PM, 25 Jan
మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
12:38 PM, 25 Jan
కాసేపట్లో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్
12:28 PM, 25 Jan
మంథనిలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
12:01 PM, 25 Jan
బండ్లగూడ జాగీర్, బడంగ్ పేట, పీర్జాదిగూడ కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ విజయం
12:00 PM, 25 Jan
ఎంపీ రేవంత్ రెడ్డి కోటాలో టీఆర్ఎస్ పాగా
12:00 PM, 25 Jan
ఇల్లెందు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
11:38 AM, 25 Jan
మీర్‌పేట, జవహర్‌నగర్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ బోణి
11:38 AM, 25 Jan
80 మున్సిపాలిటీల ఫలితాల వెల్లడి, 75 చోట్ల టీఆర్ఎస్, నాలుగుచోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ విజయం
11:32 AM, 25 Jan
కోస్గి, జనగాం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ లీడ్
11:32 AM, 25 Jan
నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
11:30 AM, 25 Jan
మీర్‌పేట, జవహర్‌నగర్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ విజయం
11:25 AM, 25 Jan
టీఆర్ఎస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు.. జిల్లాలవారీగా..
ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా) వర్ధన్నపేట (వరంగల్ రూరల్) బాన్సువాడ (కామారెడ్డి) కొత్తపల్లి (కరీంనగర్ ) చెన్నూరు (మంచిర్యాల) ధర్మపురి (జగిత్యాల) పరకాల (వరంగల్ రూరల్) పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా) మరిపెడ (మహబూబాబాద్) ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి) సత్తుపల్లి (ఖమ్మం) డోర్నకల్ (మహబూబాబాద్) భీంగల్ (నిజామాబాద్) కొత్తకోట (వనపర్తి) రాయికల్ (జగిత్యాల) ఆర్మూర్ (నిజామాబాద్) సూర్యాపేట (సూర్యాపేట)
READ MORE
7:46 AM, 25 Jan
తెలంగాణలో కాసేపట్లో ప్రారంభం కానున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
7:46 AM, 25 Jan
ఈ నెల 22వ తేదీన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నిక
7:46 AM, 25 Jan
నిన్న కరీంనగర్ కార్పొరేషన్‌కు ఎన్నిక
7:46 AM, 25 Jan
తేలనున్న 12,926 మంది భవితవ్యం
7:57 AM, 25 Jan
శుక్రవారం మూడు పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీ పోలింగ్
7:57 AM, 25 Jan
వార్డులు, డివిజన్లవారీగా ఓట్ల లెక్కింపు
7:57 AM, 25 Jan
2619 టేబుళ్లు, 1370 బృందాల ఏర్పాటు
8:12 AM, 25 Jan
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
8:12 AM, 25 Jan
5 నుంచి 24 రౌండ్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
8:12 AM, 25 Jan
మున్సిపల్ ఎన్నికల్లో 83 వార్డులు ఏకగ్రీవం
8:12 AM, 25 Jan
2647 మంది వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్ల ఎన్నిక
8:12 AM, 25 Jan
టీఆర్ఎస్ 80, ఎంఐఎం 3 వార్డుల్లో ఏకగ్రీవం
8:12 AM, 25 Jan
మధ్యాహ్నం 12 లోపు తేలిపోనున్న ట్రెండ్
8:12 AM, 25 Jan
ఉదయం 10 గంటలకల్లా తొలి ఫలితం
8:12 AM, 25 Jan
27న మేయర్, చైర్మన్ ఎన్నిక
8:13 AM, 25 Jan
మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
8:13 AM, 25 Jan
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఓటు వేసే అవకాశం
8:13 AM, 25 Jan
మేయర్, చైర్మన్ ఎన్నికల్లో కీలకం కానున్న ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు
8:17 AM, 25 Jan
నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు
8:17 AM, 25 Jan
25 బ్యాలెట్ల చొప్పున ఓట్ల లెక్కింపు
8:17 AM, 25 Jan
226 వార్డుల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు
8:17 AM, 25 Jan
బోధన్, కామారెడ్డి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల మొహరింపు
8:17 AM, 25 Jan
వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తోన్న ఈసీ
8:18 AM, 25 Jan
60 డివిజిన్లలో మున్సిపల్ ఎన్నికలు
8:18 AM, 25 Jan
నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు
8:20 AM, 25 Jan
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
8:20 AM, 25 Jan
సీఎం కేసీఆర్, హరీశ్ రావు కోటలో ఓట్ల లెక్కింపు
8:20 AM, 25 Jan
ఇదివరకు సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
8:21 AM, 25 Jan
సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ప్రాతినిధ్యం
8:21 AM, 25 Jan
ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 మున్సిపాలిటీలు
READ MORE
రెబల్స్ బెడద టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. కొల్లాపూర్, ఐజాలో ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి తన అనుచరులను మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇదీ కాస్తా అధికార పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ రెండు చోట్లు కూడా కలిస్తే టీఆర్ఎస్ పార్టీ మరింత శక్తిమంతంగా నిలిచేది.
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓడిపోయిన కొడంగల్ మున్సిపాలిటీలో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. మొన్నటి వరకు ఇక్కడినుంచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొడంగల్‌లో గులాబీ గుబాళింపుతో టీఆర్ఎస్లో మరింత జోష్ పెరిగింది.