వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Live: మున్పిపల్ ఫలితాలు.. ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు.. కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి: కేసీఆర్

|
Google Oneindia TeluguNews

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దూసుకెళ్లోంది. మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేసింది. విపక్ష కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కార్పొరేషన్‌లో ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అధికార పార్టీని గెలిపిస్తే పట్టణ/నగరాల అభివృద్ధి సాధ్యమని ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్పందించినట్టు కనిపిస్తోంది. అయితే నారాయణ ఖేడ్, యాదాద్రి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవడాన్ని మాత్రం గులాబీ దళం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే టీఆర్ఎస్ దారిదాపుల్లో ఏ పార్టీ కూడా నిలవని సిచుయేషన్ నెలకొంది.

live municipal polling counting started in telangana

Newest First Oldest First
5:35 PM, 25 Jan

ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు

ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు.. కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి.. కేసీఆర్
5:33 PM, 25 Jan

ఆల్ ఇండియా రికార్డ్

మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఆల్ ఇండియా రికార్డ్: కేసీఆర్
5:16 PM, 25 Jan

ఎన్నికల్లో అక్రమాలు

ఎన్నికల్లో అక్రమాలు.. భారీగా టీఆర్ఎస్ డబ్బు ఖర్చు చేసింది.. లక్ష్మణ్
4:46 PM, 25 Jan

నిజామాబాద్‌లో ఉత్కంఠ

నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ.. బీజేపీ 15 స్థానాల్లో, ఎంఐఎం 8, టీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలుపు..
3:17 PM, 25 Jan

ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తున్న కేటీఆర్

తెలంగాణ భవన్‌ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
3:15 PM, 25 Jan

కార్పోరేషన్లలో టీఆర్ఎస్ ఆధిక్యత

తెలంగాణలోని 9 కార్పోరేషన్లు.. 7 కార్పోరేషన్లలో టీఆర్ఎస్ ఆధిక్యత
3:11 PM, 25 Jan

అరుదైన ఫీట్‌.. కేసీఆర్ అశేషంగా విశ్వాసం

మున్సిపల్ ఎన్నికల్లో శ్రీ కేసీఆర్ నాయకత్వంపై అశేష విశ్వాసాన్ని పెట్టుకొని అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు నా ధన్యవాదాలు. 120 మున్సిపాలిటిలలో 100కుపైగా గెలుచుకోవడం లాగే 9 కార్పోరేషన్లలో 9 గెలుచుకోవడం అరుదైన ఫీట్.
3:08 PM, 25 Jan

ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో తిరుగులేని ఫలితాలు

ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
3:05 PM, 25 Jan

టీఆర్ఎస్‌దే గెలుపు

ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్‌దే గెలుపు అని మరోసారి ప్రజలు రుజువు చేశారు.. ట్విట్టర్‌లో హరీష్ రావు
1:24 PM, 25 Jan

భైంసా విజయంతో ఖాతా తెరిచిన ఎంఐఎం
1:13 PM, 25 Jan

ఏడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జయకేతనం
1:10 PM, 25 Jan

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
1:05 PM, 25 Jan

యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
12:52 PM, 25 Jan

మంథనిలో టీఆర్ఎస్ జయభేరీ. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పుట్టా శైలజాతో టీఆర్ఎస్ వార్డు సభ్యులు గుండా విజయలక్ష్మీ (1వ వార్డు) కుర్ర లింగయ్య (4వ వార్డు) కాయితి సమ్మయ్య (6వ వార్డు) గరపెళ్లి సత్యనారాయణ (7వ వార్డు), కొట్టే పద్మ (8వ వార్డు) వడ్లకొండ రవి (11వ వార్డు), వేముల లక్ష్మి (12వ వార్డు)
12:44 PM, 25 Jan

తొర్రూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం
12:42 PM, 25 Jan

ఆలేరు, నర్సంపేట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జయభేరీ
12:41 PM, 25 Jan

చొప్పదండి, పెబ్బేరు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం
12:38 PM, 25 Jan

మున్సిపోల్స్‌పై ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్న కేసీఆర్
12:38 PM, 25 Jan

మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
12:38 PM, 25 Jan

కాసేపట్లో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్
12:28 PM, 25 Jan

మంథనిలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
12:01 PM, 25 Jan

బండ్లగూడ జాగీర్, బడంగ్ పేట, పీర్జాదిగూడ కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ విజయం
12:00 PM, 25 Jan

ఎంపీ రేవంత్ రెడ్డి కోటాలో టీఆర్ఎస్ పాగా
12:00 PM, 25 Jan

ఇల్లెందు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
11:38 AM, 25 Jan

మీర్‌పేట, జవహర్‌నగర్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ బోణి
11:38 AM, 25 Jan

80 మున్సిపాలిటీల ఫలితాల వెల్లడి, 75 చోట్ల టీఆర్ఎస్, నాలుగుచోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ విజయం
11:32 AM, 25 Jan

కోస్గి, జనగాం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ లీడ్
11:32 AM, 25 Jan

నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
11:30 AM, 25 Jan

మీర్‌పేట, జవహర్‌నగర్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ విజయం
11:25 AM, 25 Jan

టీఆర్ఎస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు.. జిల్లాలవారీగా.. ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా) వర్ధన్నపేట (వరంగల్ రూరల్) బాన్సువాడ (కామారెడ్డి) కొత్తపల్లి (కరీంనగర్ ) చెన్నూరు (మంచిర్యాల) ధర్మపురి (జగిత్యాల) పరకాల (వరంగల్ రూరల్) పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా) మరిపెడ (మహబూబాబాద్) ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి) సత్తుపల్లి (ఖమ్మం) డోర్నకల్ (మహబూబాబాద్) భీంగల్ (నిజామాబాద్) కొత్తకోట (వనపర్తి) రాయికల్ (జగిత్యాల) ఆర్మూర్ (నిజామాబాద్) సూర్యాపేట (సూర్యాపేట)
READ MORE

రెబల్స్ బెడద టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. కొల్లాపూర్, ఐజాలో ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి తన అనుచరులను మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇదీ కాస్తా అధికార పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ రెండు చోట్లు కూడా కలిస్తే టీఆర్ఎస్ పార్టీ మరింత శక్తిమంతంగా నిలిచేది.

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలో ఓడిపోయిన కొడంగల్ మున్సిపాలిటీలో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. మొన్నటి వరకు ఇక్కడినుంచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొడంగల్‌లో గులాబీ గుబాళింపుతో టీఆర్ఎస్‌లో మరింత జోష్ పెరిగింది.

English summary
municipal polling counting started in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X