వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు, మూడురోజుల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు, రైతు బంధు కూడా: మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోన్న సమయంలో కూడా అన్నదాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. రూ.25 వేల లోపు ఉన్న రుణం కోసం రూ.1200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు రైతుబంధు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పథకాల నిధులు ఆగబోమని ఈ మేరకు ట్వీట్ చేశారు.

Recommended Video

Minister KTR Assurance To Telangana Farmer's | Oneindia Telugu
 loan waiver will be credit to farmers account with in 3 days

రూ.25 వేల రుణం తీసుకున్న రైతులు 5.50 లక్షల మంది ఉన్నారని కేటీఆర్ తెలిపారు. లబ్ది పొందుతారన్నారు. వానాకాలం పంట రైతుబంధు కోసం నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. రూ. 7 వేల కోట్ల విడుదల చేస్తామని.. దీంతో 57 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రైతు బంధు నగదు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమవుతోందని కేటీఆర్‌ తెలిపారు.

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ సొమ్మును చెక్కుల రూపంలో అందజేయాలని ప్రభుత్వం భావించింది.. కానీ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అనుకొంది. పిలిచి చెక్కులు ఇచ్చేకన్నా.. నేరుగా రైతుల ఖాతాలో నగదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేయడంతో.. ఒకటి, రెండు రోజుల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది.

English summary
loan waiver will be credit to farmers account with in 3 days telangana minister ktr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X