వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారంలోనే లోకల్ పోరు .. వరుస ఎన్నికల కోడ్ తో స్తంభిస్తున్న పాలన

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Election 2019 : వారంలోనే లోకల్ పోరు... వరుస ఎన్నికలకోడ్ తో స్తంబించిన పాలన

తెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది . స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మే 20 లోపు పూర్తి చేయాలని, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ఫలితాలను వెలువరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

<strong>సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ సీజ్ చేసిన బ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన</strong>సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ సీజ్ చేసిన బ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

 లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండగానే లోకల్ పోరుకు గ్రీన్ సిగ్నల్

లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండగానే లోకల్ పోరుకు గ్రీన్ సిగ్నల్

లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే పనిలో పనిగా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈసీఐ అనుమతి కోరింది. మార్చి 13, 22వ తేదీల్లో రెండు సార్లు ఈసీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ లేఖకు స్పందించిన ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఓకే చెప్పింది . స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మే 20 లోపు పూర్తి చేయాలని, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ఫలితాలను వెలువరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

ఈ వారంలో స్థానికసంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం

ఈ వారంలో స్థానికసంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం

ఈ నెల 13,14 వ తారీకులలో జిల్లా , మండల పరిషత్ రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈనెల 15న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. ఇక 18వ తేదీన జిల్లా ఎస్పీ కలెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. జిల్లా ఉన్నత అధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మూడు విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తు, 535 మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహించనున్నారు.వారం రోజులలో షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల 23వ తేదీన తొలివిడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

వరుస ఎన్నికల కోడ్ తో స్తంభిస్తున్న పాలన

వరుస ఎన్నికల కోడ్ తో స్తంభిస్తున్న పాలన

వరుస ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. గతేడాది సెప్టెంబర్ నుండి మొదలైన ఎన్నికల కోడ్ ఈ ఏడాది మే చివరి వారం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా పాలనాపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బంది కలుగుతుంది. అందుకే పనిలో పనిగా ఎన్నికలు కూడా నిర్వహిస్తే మరోమారు విఘాతం కలగకుండా ఉంటుందని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ఆటంకం కలగడంతో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మరోసారి ఆటంకం కలగకూడదని కోడ్ ఉన్నప్పుడే ఎన్నికలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్ .

English summary
The Telangana government has given permission to the Telangana government seeking the Election Commission of India to conduct the election of the local bodies in Telangana state .The government has given the green signal to the local bodies election. ECI sought permission for local bodies to function as work in the Lok Sabha election code. ECI has suggested that the results of local elections should be disclosed after the results of the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X