వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిల ఇక్కడ.. ఎవడ్రా అక్కడ?.. లాక్‌డౌన్ వేళ లేడీ సర్పంచ్ హల్‌చల్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతుండంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అడుగుముందుకేసి.. జనం బయటికొస్తే 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, లాక్ డౌన్ సజావుగా అమలు చేసే బాధ్యతను పోలీసులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా పంచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఓ లేడీ సింగం రంగంలోకి దూకింది.. ఊరి సరిహద్దులో బరి గీసిమరీ.. బడితె పట్టుకుని నిలబడి.. 21 రోజుల పాటు అటు కాకిని ఇటు రానియ్యబోనని కంకణం కట్టుకుంది..

ఇంతకీ ఆమె ఎవరంటే..

ఇంతకీ ఆమె ఎవరంటే..


ఆమె పేరు అఖిల. పూర్తిపేరు.. ఉడుత అఖిల యాదవ్. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సర్పంచ్ ఆమె. తెలంగాణలోనే యంగెస్ట్ లేడీ సర్పంచ్ గా రికార్డు నెలకొల్పిన అఖిల.. బుధవారం నుంచి తన గ్రామపంచాయితీ శివారులో ఇలా కాపలా కాస్తున్నది. లాక్ డౌన్ సక్సెస్ అయ్యేలా వార్డు మెంబర్ల నుంచి మంత్రుల దాకా ప్రజాప్రతినిధులందరూ కార్యక్షేత్రంలోకి దూకాలని సీఎం కేసీఆర్ కోరిందే తడవుగా బుధవారం నుంచి రంగంలోకి దిగింది.

ఫొటోలు వైరల్

ఫొటోలు వైరల్

గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి, బయటివాళ్లెవరినీ రానీయకుండా ఆమె కాపలా కాస్తున్నారు. తద్వారా తన ప్రజల్ని కరోనా బారినుంచి కాపాడుకుంటున్నారు. చేతిలో బడితె పట్టుకుని, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని శివంగిలా నిలబడ్డ అఖిల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఖిలకు తోడుగా నిలిచిన గ్రామస్తులు.. పొలం పనులు చేసేటప్పుడు కూడా గుంపులుగా కాకుండా దూరంగా నిలబడి సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు.

పెరిగిన కేసులు..

పెరిగిన కేసులు..


తెలంగాణలో బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చినవాళ్లతోపాటు లోకల్ గానూ కరోనా సోకిన కేసులు నమోదయ్యాయి. లోకల్​గా కరోనా సోకిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ (57), అతని ఇంట్లో పనిచేసే మహిళ (33) ఉన్నారు. ఈనెల 18న లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కొడుకు ద్వారా ఇలా వైరస్ వ్యాప్తి చెందింది.

English summary
making people to follow lock down rules, telangana's youngest sarpanch akhila yadav once again in news. amid lock down the cardened village and not allowing unknown persons due to coronavirus threats
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X