• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రంజాన్ నెలలో హలీం కోసం అష్టకష్టాలు .. ధరలు పెంచి సీక్రెట్ గా అమ్మకాలు

|

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ రంజాన్ మాసం మీద పడింది . రంజాన్ నెలలో హలీం కోసం ఎదురు చూసే వాళ్లకు లాక్ డౌన్ ఎఫెక్ట్ తీవ్ర నిరాశను మిగిల్చింది .రంజాన్ మాసం కోసం ముస్లింలు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువ ఇతర మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా చేసి రంజాన్ మాసాన్ని అందరి మనస్సులో ప్రత్యేక నిలబెట్టింది మాత్రం రంజాన్ స్పెషల్ గా భావించే హలీం .ఇక ఈ సారి హలీం తినే పరిస్థితి లేక రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళతో పాటు అటు హలీం ప్రియులంతా తెగ బాధ పడుతున్నారు.

  Haleem Sales In Hyderabad Effect During Lockdown, People Facing Problems To Eat

  హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా

   కనిపించని రంజాన్ సందడి.. హలీం ఘుమఘుమలు లేని నగరాలు

  కనిపించని రంజాన్ సందడి.. హలీం ఘుమఘుమలు లేని నగరాలు

  రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు బలం కోసం తీసుకునే ఆహారం హలీం . అన్ని మతాల వారికి ప్రీతిపాత్రమైన ఫుడ్ ఏదైనా ఉంటే అది హలీం అని చెప్పక తప్పదు. రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలే కనిపించేవి. అటు హైదరాబాద్ లోనూ, ఇటు ఇతర ప్రాంతాల్లో హలీం కోసం ఎగబడుతున్న జనాలు రంజాన్ సందర్భంగా కనిపించేవారు . ఇక ఆ వాతావరణం రంజాన్ సందడిని కళ్ళ ముందు నిలిపేది .హలీం విక్రయ కేంద్రాల్లో ముస్లిమ్స్ కంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళే దర్శనమిచ్చే వారు.

  గత 50 ఏళ్లలో ఎప్పుడు ఎదురుకాని అనుభవం

  గత 50 ఏళ్లలో ఎప్పుడు ఎదురుకాని అనుభవం

  హైదరాబాద్ హలీమ్ పరిశ్రమ రంజాన్ సందర్భంగా వందల కోట్ల విలువైన బిజినెస్ చేస్తుంది. కరోనావైరస్ మహమ్మారి ఫలితంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఈసారి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గత 50 ఏళ్లలో హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా హలీమ్‌కు సేవలు అందించకపోవడం ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నపరిస్థితి .

  అనుమతితో కొందరు , అనుమతి లేకుండా కొందరు హలీం విక్రయాలు

  అనుమతితో కొందరు , అనుమతి లేకుండా కొందరు హలీం విక్రయాలు

  ఇక ఈసారి కరోనా వ్యాప్తిని నివారించటం కోసం అన్ని హోటళ్ళు, రెస్టారెంట్ లు బంద్ అయ్యాయి . ఇక దీంతో హలీం చేసేవారు లేక , హలీం ప్రియులు తెగ ఇబ్బంది పడుతున్నారు . ఇక దీంతో హలీం ప్రియుల కోసం కొందరు హలీం తయారు చేసి రహస్యంగా విక్రయిస్తున్నారు. ఎలాగైనా హలీమ్‌ తినాల్సిందే అన్నట్టు ఆరాటం చూపే వారి కోసం హైదరాబాద్ , వరంగల్ నగరాలలో కొందరు హలీమ్‌ తయారీదార్లు, హోమ్‌చెఫ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. కొందరు అనుమతి తీసుకుని హలీం డోర్ డెలివరీ చేస్తుంటే కొందరు రహస్య విక్రయాలు సాగిస్తున్నారు.

   హలీం అమ్మకాలకు ఇబ్బంది .. భారీగా ధరలు పెంచి రహస్యవిక్రయాలు

  హలీం అమ్మకాలకు ఇబ్బంది .. భారీగా ధరలు పెంచి రహస్యవిక్రయాలు

  ఇక దీంతో అలా తయారు చేస్తున్న హలీం అధిక ధరలతో విక్రయిస్తున్నారు. వరంగల్ లో ఒక హలీం 150 రూపాయల ధర పలుకుతుంటే హైదరాబాద్లో ఒక హలీమ్‌ రూ.300.. అదే ఫ్యామిలీ ప్యాక్‌ అయితే రూ.1000 ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. అధికారిక అనుమతితో కొందరు ,అనధికారికంగా కొందరు హలీం తయారు చేసి విక్రయిస్తుంటే దొంగల్లా హలీం కొనుక్కుని తినాల్సిన పరిస్థితి వచ్చింది . ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనప్పటికీ ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమైన హలీం రంజాన్ మాసం స్పెషల్ ఫుడ్ కావటంతో అందరూ కాస్త ఎక్కువ ధర అయినా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

  ఇళ్లలోనే తయారీకి యత్నం .. యూట్యూబ్ లో జోరుగా హలీం తయారీ సెర్చ్

  ఇళ్లలోనే తయారీకి యత్నం .. యూట్యూబ్ లో జోరుగా హలీం తయారీ సెర్చ్

  హలీం ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకుంది . రంజాన్ మాసంలో వంటల్లో రారాజు గా చెప్పుకునే హలీం రంజాన్ మాసం ముగుస్తుంది అంటే అన్ని మతాల వారిలో బాధను మిగులుస్తుంది. ఈ సారి తిన్న ఫీల్ కూడా కలగకుండా మరో వారం రోజుల్లో హలీం అందరికీ దూరం కానుంది . రంజాన్ మాసంలో మాత్రమే దొరికే ఈ స్పెషల్ ఫుడ్ కోసం బయట దొరక్క ఇబ్బంది పడుతున్న వారు ఇళ్లలోనే ప్రయోగాలు చేస్తున్నారు . వండటానికి నానా తిప్పలు పడుతున్నారు. యూట్యూబ్ లో తెగ సెర్చ్ చేసి పాక ప్రావీణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు .

  అందరికీ బాధను మిగిల్చి హలీం రుచి చూడకుండా చేసిన కరోనా లాక్ డౌన్

  అందరికీ బాధను మిగిల్చి హలీం రుచి చూడకుండా చేసిన కరోనా లాక్ డౌన్

  ఇక హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయినా పిస్తా హౌజ్ హలీం కూడా ఈసారి కరోనా దెబ్బకు కుదేలైంది . కొంత ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తున్నా సరే ఎప్పటిలా ఈ సారి పరిస్థితి లేకపోవటంతో అటు అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నారు . ఈసారి బాగా గిరాకీ ఉంటుందని భావించి ముందే ఏర్పాట్లు చేసుకున్న పిస్తా హౌజ్ యాజమాన్యానికి కరోనా గట్టి దెబ్బ కొట్టింది. ఇక హైదరాబాద్ లో చాలా హోటళ్ళు అనుమతి తీసుకుని మరీ హలీం తయారు చేసి స్విగ్గీ , జోమాటో వంటి వాటి ద్వారా ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తున్నా ఈసారి హలీం తిన్న ఫీల్ జనాలకు కలగటం లేదు . ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ ప్రభావం ఈ సారి హలీం రుచులు చూడకుండా చేసింది . అందరికీ బాధను మిగిల్చింది .

  English summary
  The Haleem industry makes sales worth hundreds of crores during Ramadan. People associated with the industry in Hyderabad say this time the industry will suffer badly due to the coronavirus pandemic and the resultant lockdown. This is also probably the first time in the past 50 years that eateries in Hyderabad will not be serving Haleem during Ramadan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X