వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో లాక్ డౌన్ రూల్స్ కఠినం .. అత్యవసరం కాకుండా రోడ్ల మీదకు వస్తే వాహనాలు సీజ్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతుంది . అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు కరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న సర్కార్ కు తలనొప్పిగా మారాయి. అటు ప్రభుత్వాలు కరోనాకు అడ్డు కట్ట వెయ్యటానికి శాయశక్తులా పని చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5237కేసులు నమోదు కాగా ,150 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

ఏప్రిల్ 14 వరకూ హైదరాబాద్ లో కఠిన నిబంధనలు

ఏప్రిల్ 14 వరకూ హైదరాబాద్ లో కఠిన నిబంధనలు

తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు చూస్తే 404 గా ఉంది. ఇక దీనిని అదుపు చెయ్యటానికి సామాజిక దూరం పాటించటం తప్ప వేరే పరిష్కారం లేదు .ఇక లాక్ డౌన్ తెలంగాణా రాష్ట్రంలో కొనసాగుతున్నా లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి కొంతమంది ప్రజలు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇక వీరిని ఆపటానికి తెలంగాణా పోలీస్ శాఖ మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకూ హైదరాబాద్ లో అనవసరంగా బైకులు, కార్లు వాడుతూ తిరిగినట్టు గమనిస్తే సీజ్ చెయ్యాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

 కర్ణాటక బాటలో రోడ్ల మీదకు వస్తే బైక్‌లు , కార్లు స్వాధీనం చేసుకోనున్న పోలీసులు

కర్ణాటక బాటలో రోడ్ల మీదకు వస్తే బైక్‌లు , కార్లు స్వాధీనం చేసుకోనున్న పోలీసులు

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో సైతం ఈ రూల్స్ కఠినతరం చేశారు .ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న కీలక నిర్ణయం మేరకు రోడ్ల మీదకు వస్తే బైక్‌ను స్వాధీనం చేసుకోనున్నారు. అత్యవసర కారణాలతో బయటకు వచ్చిన వారు తప్ప మిగిలిన వారిని కట్టడి చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌ విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని గుర్తించారు .

ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు.. వాహనాలు సీజ్

ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు.. వాహనాలు సీజ్

ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావటాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీస్‌ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో కారణం లేకుండా తిరిగే బైక్‌లు, కార్లపై వచ్చిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Recommended Video

AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329

English summary
The Telangana Police Department has taken a more stringent decision to stop the public on roads. hyderabad police has warned that the people who are unneccesarily roaming on roads with bikes and cars in the state will be seized till April 14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X