వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: లవ్ మ్యారేజ్, విదేశాల్లో ఉద్యోగం, డబ్బులు లేక కాటేజ్ లో టెక్కీలు ఆత్మహత్య, రీచార్జ్ !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ చెన్నై/ కోడైకెనాల్: సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన యువతి, యువకుడు ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కరోనా దెబ్బతో దాచుకున్న డబ్బులు ఖాళీ కావడం, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లడానికి డబ్బులు లేకపోవడం, సహాయం చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం, సొంత ఊర్లకు వెళ్లడానికి లాక్ డౌన్ అడ్డు కావడం, కనీసం మొబైల్ కరెన్సీ రీచార్జ్ చెయ్యడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన టెక్కీలు ఆత్మహత్య చేసుకున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

తెలంగాణ అమ్మాయి

తెలంగాణ అమ్మాయి


తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోజెట్ల గోపికృఫ్ణన్ (25), నందిని (25) అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. గోపికృఫ్ణన్, నందిని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గోపికృఫ్ణన్, నందిని గత ఏడాది పెళ్లి చేసుకుని తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కోడైకెనాల్ లోని అట్టువంపట్టి ప్రాంతంలో కాటేజ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

 విదేశాల్లో నందినికి ఉద్యోగం ఓకే

విదేశాల్లో నందినికి ఉద్యోగం ఓకే


కరోనా వైరస్ దెబ్బతో గత మార్చి నెల నుంచి గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలకు వెళ్లకుండా కాటేజ్ కే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో గోపికృఫ్ణన్, నందిని దంపతులు విదేశాల్లో ఉద్యోగాలు సంపాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నందినికి ఇటీవల ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం వచ్చింది.

 లాక్ డౌన్ దెబ్బకు ఆర్థిక సమస్యలు

లాక్ డౌన్ దెబ్బకు ఆర్థిక సమస్యలు

ప్రస్తుతం పని చేస్తున్న చోట గోపికృఫ్ణన్, నందిని ఉద్యోగాలు నిలిపివేశారని తెలిసింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు దాచుకున్న డబ్బులు ఖాళీ అయిపోయాయి. కొంతకాలం నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆర్థిక సమస్యలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. కాటేజ్ కే పరిమితం అయిన గోపికృఫ్ణన్, నందిని చుట్టుపక్కల వాళ్లతో అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నారు.

డిప్రెషన్ లో దంపతులు

డిప్రెషన్ లో దంపతులు

కొడైకెనాల్ సొంత ఊరు కాకపోవడంతో ఆర్థిక సహాయం చెయ్యాలని గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఎవ్వరినీ అప్పు అడగలేకపోయారు. ఇదే సమయంలో నందిని ఆస్ట్రేలియా వెళ్లడానికి డబ్బులు అవసరం అయ్యింది. లాక్ డౌన్ కారణంగా గోపికృఫ్ణన్, నందిని తెలంగాణకు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాలపై గోపికృఫ్ణన్, నందిని దంపతులు తీవ్ర డిప్రెషన్ లకు లోనై సతమతం అయ్యారు.

 రెండు రోజుల బయటకు రాకపోవడంతో !

రెండు రోజుల బయటకు రాకపోవడంతో !

గత రెండు రోజుల నుంచి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి బయటకురాలేదు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి గోపికృఫ్ణన్, నందిని దంపతులు కాటేజ్ నుంచి ఎందుకు బయటకురావడం లేదు అనే అనుమానంతో వెళ్లి తలుపులు తట్టారు. గోపికృఫ్ణన్, నందిని దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాటేజ్ తలుపులు పగలగొట్టి చూడగా గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

రెండు మాటలతో డెత్ నోట్

రెండు మాటలతో డెత్ నోట్


గోపికృఫ్ణన్, నందిని మొబైల్ ఫోన్లలో కరెన్సీ పూర్తిగా ఖాళీ అయ్యిందని పోలీసులు గుర్తించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడం, విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వలనే ఆత్మహత్య చేసుకుంటున్నామని రెండు మాటలు మాత్రమే డెత్ నోట్ రాసి పెట్టి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. విదేశాలకు వెళ్లడానికి అవకాశం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో గోపికృఫ్ణన్, నందిని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని కోడైకెనాల్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
lockdown: Telangana couple commits suicide in Kodaikkanal cottage in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X