వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ టైం.. రోడ్ల మీద తిరిగే వాళ్లకు క్లాస్ పీకుతున్న తెలంగాణా మంత్రి హరీష్ రావు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది . ఇక లాక్ డౌన్ సందర్భంగా ప్రజలతో పాటు చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా అధికారులకు ఆదేశాలిస్తూ , నిత్యం ప్రజల అవసరాల గురించి ఆరా తీస్తున్న మంత్రులు ఎవరికి వారు పనులు చేసుకుంటున్నా మీడియాకు మాత్రం దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు సైతం కరోనా నియంత్రణా చర్యల్లో పాల్గొంటున్నా ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. ప్రజలనుసైతం చైతన్యపరుస్తున్నారు.

లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్ల మీద వాహనదారులకు హరీష్ క్లాస్

లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్ల మీద వాహనదారులకు హరీష్ క్లాస్

ఇక తాజాగా లాక్ డౌన్ ఉన్నా ప్రజలు చాలా వరకు బయటకు వస్తున్న నేపధ్యంలో తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా టూ వీలర్ మీద వెళ్లే సిద్దిపేట వాసులకు క్లాస్ పీకారు. ఫ్యామిలీతో కలిసి వెళుతున్న వాహనదారుడ్ని ఆపిన హరీష్ కరోనా వైరస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దయచేసి ఇళ్లలోనే ఉండాలని కోరారు. అందరిని ఇళ్లల్లో ఉండమంటే బండి మీద ఫ్యామిలీని తీసుకొని ఎక్కడకు బయలుదేరావు? అని ప్రశ్నించిన హరీష్ రావు సదరు వాహనదారుడికి క్లాస్ పీకారు .హరీష్ రావును చూసిన సదరు వాహనదారులు ఆయనకు ఏదో చెప్పే ప్రయత్నంచారు.

 రోడ్ల మీద తిరిగితే కేసులు పెట్టి లోపల వేస్తామని వార్నింగ్

రోడ్ల మీద తిరిగితే కేసులు పెట్టి లోపల వేస్తామని వార్నింగ్

ఓ పక్క వైరస్ తో ప్రపంచం మొత్తం వణుకుతుంటే.. అదేమీ పట్టనట్లుగా రోడ్ల మీదకు ఎలా వస్తున్నారు? ఇలా బయటకు రావటం ముప్పు అని తెలీదా? అని హరీష్ రావు వారికి అర్ధం అయ్యేలా చెప్పారు . ఇక అంతేకాదు ప్రజలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు . అధికారులు మీ కోసం ఇంతలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరించరా? మీకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన ఆయన పద్ధతి మార్చుకోవాలని సూచించారు . ఇలాంటి వైఖరితోనే వ్యవహరిస్తే కేసులు పెట్టి లోపల వేస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని అని తీవ్ర స్వరంతో కొందరికి వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో తాజాగా హరీశ్ చేసిన హడావుడి సిద్దిపేటలో హాట్ టాపిక్ గా మారింది.

లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన హరీష్ రావు

లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన హరీష్ రావు

ఇక మొన్నటికి మొన్న హరీశ్ రావు సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు లేకుండా విధులు ఏలా నిర్వర్తిస్తున్నారని సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్‌ పై ఆయన ఫైర్ అయ్యారు. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలకు నిత్యావసరాలు అందుతున్నాయా లేదా కూరగాయలకు ఇబ్బంది ఏమైనా ఉందా వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు .

English summary
Telangana Finance Minister Harish Rao took the class to Siddipeta residents who are riding on Two Wheeler in the wake of the latest lockdown. Harish, stopped the persons who are going with the family, was trying to raise awareness on the corona virus. minister asked them to stay at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X