హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: స్లీవ్‌లెస్, షార్ట్స్ ధరించడంపై సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ బ్యాన్, పెళ్లికి లింక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో పేరున్న మహిళా కళాశాలల్లో ఒకటైన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ అమ్మాయిలు ధరించే దుస్తులపై నిబంధనలు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం కాలేజీకి వచ్చే విద్యార్థినులు మోకాళ్ల కిందికి ఉండేలా కుర్తీస్ ధరించాలి. అంతేగాక, స్లీవ్‌లెస్, షార్ట్స్ ధరించడంపై నిషేధం విధించింది.

తరగతులకు అనుమతి నిరాకరణ

తరగతులకు అనుమతి నిరాకరణ

ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, నిబంధనలకు అనుగుణంగా దస్తులు వేసుకు వెళ్లని విద్యార్థులను తరగతులకు అనుమతించడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు తరగతులను మిస్ అవుతున్నారు.

ఇంకా ఇలాంటి పద్ధతులా..?

ఇంకా ఇలాంటి పద్ధతులా..?

కాగా, కాలేజీ ఈ విధమైన నిబంధనలను విధించడంపై పలువురు విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఇది తిరోగమన చర్య అని, ఇంకా పాత పద్ధతులు పట్టుకుని వేలాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ అమలు చేస్తున్న నిబంధనలపై పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు.

మంచి పెళ్లి సంబంధాలు..

మంచి పెళ్లి సంబంధాలు..

మహిళల సాధికారత గురించి మాట్లాడుకుంటూనే ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారని నిలదీస్తున్నారు. జోనోబియా అనే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ పూర్వ విద్యార్థిని తన ఫేస్‌బుక్ ద్వారా నిరసన వెల్లడించారు. ఏడాది మధ్య కాలంలో కాలేజీ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. పొడవైన కుర్తీస్ వేసుకోవడం వల్ల మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయని కాలేజీ యాజమాన్యం చెబుతోందని మండిపడ్డారు.

భారీ నిరసన..

భారీ నిరసన..

మహిళలను అవమానించే ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కుర్తీస్ కొంచెం పొట్టిగా.. మోకాళ్లపైకి ఉంటే క్లాసులకు అనుమతించడం లేదని మండిపడ్డారు. డ్రెస్ కోడ్ ను అమలు చేసేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా కాలేజీ యాజమాన్యం నియమించిందని చెప్పారు. సోమవారం ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజీ విద్యార్థినులు భారీ నిరసనకు పిలుపునిచ్చారు.

English summary
St Francis College for women, which is a reputed college for girls in Hyderabad has placed a dress code for its students. Under the new rule, the students have been ordered to wear Kurtis below knee length with sleeves while shorts, sleeveless or other similar dresses are banned in the campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X