• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎర్ర‌జొన్న రైతుల నిలువు దోపిడి..! పట్టించుకోని ప్రభుత్వం..!!

|

హైద‌రాబాద్ : ఎర్ర జొన్న రైతుల ప‌రిస్థితి దీనంగా త‌యార‌య్యింది. ధ‌ర త‌గ్గుతున్నా ప్ర‌భుత్వ క‌నీస మ‌ద్ద‌త్తు ధర ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ప్ర‌భుత్వం ఆస‌రా లేక, మ‌ద్య‌వ‌ర్తుల ఇష్టా రాజ్యంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను విక్రయిస్తున్నారు రైతులు. ప్రభుత్వ ప్ర‌త్య‌క్షంగా కొనుగోలు కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదనే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఇక నైనా ఎర్ర జొన్న రైతుల గురించి తెలంగాణ సర్కారు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే రాహుల్ ప‌ర్య‌ట‌న‌..! చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న టీపిసిసి..!!

 ఎర్రజొన్న ధర తెగ్గొస్తున్న వ్యాపారులు..! ఆందోళ‌న‌లో అన్న‌దాత‌లు..!!

ఎర్రజొన్న ధర తెగ్గొస్తున్న వ్యాపారులు..! ఆందోళ‌న‌లో అన్న‌దాత‌లు..!!

ఎర్రజొన్న రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంలో ఘోరంగా మోసపోతున్నారు. మద్దతు ధర కోసం ఓవైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కారు నుంచి స్పందన కరువైంది. ఇదే అదనుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతుల పుట్టి ముంచుతున్నారు. మొన్నటి వరకు ఎర్రజొన్న క్వింటాల్‌ ధర రూ. 2,100 పలికింది. కాని అక‌స్మాత్తుగా 1650 రూపాయ‌ల‌కు ధ‌ర ప‌డిపోయింది. అయితే, గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయని రైతాంగం వాపోతోంది.

మరింత ధర పడిపోతుందని ప్రచారం..! దిగులు ప‌డుతున్న రైతులు..!!

మరింత ధర పడిపోతుందని ప్రచారం..! దిగులు ప‌డుతున్న రైతులు..!!

సర్కారు స్పందించక పోవడాన్ని అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తున్నారు వ్యాపారులు. మొన్నటివరకు పైగా క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకూ కడ్తా తీసేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత సంవత్సరం జొన్న విత్తడం ప్రా రంభం నుంచి విక్రయించే వరకు రైతులకు తిప్ప లు తప్పడం లేదు. ఎర్ర జొన్నలను గతేడాది ప్రభుత్వం కొనుగోలు చేయడంతో, ప్రస్తుత సంవత్సరం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ధీమాతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. కానీ సర్కారు చేతులు ఎత్తివేయడంతో జొన్న రైతులు ఉద్యమ బాట పట్టారు.

 ధర తగ్గించేశారు..! ప్రభుత్వమే ఆదుకోవాలి..!!

ధర తగ్గించేశారు..! ప్రభుత్వమే ఆదుకోవాలి..!!

ఎర్ర జొన్నలు క్వింటాలు 1650 రూపాయాలకు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో 2100 రూపాయాలకు కొనుగోలు చేసిన వ్యాపారులు 15 రోజుల్లో ధరను తగ్గించేశారు. ధర తగ్గించడం, కడ్తా రూపంలో ఆరు కిలోలు తీసేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధర కారణంగా రైతులు ప్రస్తుతం క్వింటాల్‌కు 450 రూపాయ‌ల చొప్పున నష్టపోతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాల్‌కు 2300 రూపాయాల మద్దతు ధర ప్రకటించింది. ఆ లెక్క ప్రకారమైతే 650 రూపాయ‌ల చొప్పున నష్టపోతున్నారు.

మరింత తగ్గుతుందని ప్రచారం..! ఆందోళ‌న‌లో రైతులు..!!

మరింత తగ్గుతుందని ప్రచారం..! ఆందోళ‌న‌లో రైతులు..!!

మరోవైపు, ధర మరింత తగ్గుతుందని దళారులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. క్వింటాల్‌ ధర 1500 రూపాయ‌ల‌ వరకు పడిపోతుందంటూ వ్యాపారులు ప్రచారం చేయిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనతో వచ్చిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. తామంతా ఐక్యంగా ఉండాలని, ఎవరు కూడా జొన్నలను విక్రయించవద్దని తొలుత రైతులు నిర్ణయించుకున్నారు. అయితే, రైతుల ఐక్యతను దెబ్బ తీయడానికి మొదట్లో వ్యాపారులు 2100 రూపాయ‌ల ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించగా, కొందరు పంట విక్రయించుకున్నారు. దీంతో రైతుల ఐక్యతను క్రమంగా దెబ్బతీసిన వ్యాపారులు ఇప్పుడు ధరను తగ్గించేస్తున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం స్పందించి ఎర్ర జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The price of red maize for quintal is up to Rs. 2,100. But suddenly the price of Rs 1650 fell. The condition of the red maize farmers has been sad. As the price declined, the farmers have fallen into a state of disarray as the government has not announced a minimum support price. The farmers are selling crops at the price of the merchants. Opinions have shown that farmers will benefit if government purchases directly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more