వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వినాయకుడి విగ్రహాం: రైతు పొలంలో.. తండోపతండాలుగా వస్తోన్న జనం

|
Google Oneindia TeluguNews

వచ్చేనెలలో వినాయక చవితి వస్తోంది. కరోనా వల్ల వినాయక చవితి జోష్ అంతగా ఉండటం లేదు. కానీ ఆ దేవదేవుడిని మాత్రం అంతే నిష్టతో కొలుస్తున్నారు. వినాయక చవితి వేళ.. భారీ విగ్రహాం ఒకటి బయటకు వచ్చింది. అదీ పురాతన విగ్రహాం అని.. జనం భక్తీతో కొలుస్తున్నారు. ఆదిదేవుడు తమలను కరుణించారని అంటున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

ఓ పొలం నుంచి విఘ్నేశ్వరుడి భారీ విగ్రహం ఒకటి బయటపడింది. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు భూమిలో విగ్రహాం కనిపించింది. పంట సాగు కోసం నిన్న సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నించారు. ఆ క్రమంలో ట్రాక్టర్ నాగలికి తగిలి గణేశుడి విగ్రహంతోపాటు దానిని ప్రతిష్ఠించే భారీ పీఠం బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

lord ganapathi huge idol came from farm land

వినాయకుడిని చూసి జనం భారీగా వస్తున్నారు. పురాతన విగ్రహాం కావడంతో నమస్కరిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి.. ఏకదంతుడి ముందు గుంజీలు తీస్తున్నారు. రైతు అనంతరావుకు మంచి జరుగుతుందని పలువురు అంటున్నారు. ఆయన ఇంట ఇక లక్ష్మీ వరించినట్టేనని అభిప్రాయ పడుతున్నారు. ఇకపై మరింత మంచి జరుగుతుందని వెల్లడించారు. వినాయకుడి ప్రతీమ చూసేందుకు జనం తండోపతండాలుగా తరలిస్తున్నారు. ఏకదంతుడిని నిష్టతో పూజలు చేస్తున్నారు. విఘ్నేస్వర, జై గణేశ్ మహారాజ్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

English summary
lord ganapathi huge idol came from farm land in sangareddy disttict narayanakhed mandal turkapalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X