వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో శంకరుడు.. హైదరాబాద్‌లో అద్భుతం..!?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బోనాల పండగ సెంటిమెంట్‌తో హైదరాబాద్ నగరం ముసురేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటు జల్లులు కురుస్తోన్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుడిని ప్రార్థిస్తారు భక్తులు. తమ ఇలవేల్పును భక్తులు కొలుస్తున్నారో ఏమో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఔను శివుడి రూపంలో కనిపించిన దృశ్యరూపం భక్తులకు కనువిందు చేసింది. అయితే ఇదీ హైదరాబాద్‌లో జరిగిందా ? ఇతర ప్రాంతాల్లో జరిగిందా అనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

lord shiva Facsimile in sky

సోమవారం రోజున ఆకాశంలో శివుడి రూపం ప్రతిబించింది. దానిని చూసిన వారు హర హర మహాదేవ శంభోశంకర అంటూ కీర్తించారు. మరికొందరు ఆకాశలో ఆకారం చూసి తన్మయత్వం పొందారు. అయితే సోమవారం రోజున ఈ దృశ్యం కనిపించడంతో భక్తుల సెంటిమెంట్ రెట్టింపయ్యింది. తమ ఆరాధ్యదైవం తమకు ఇంపుగా కనిపించారని చెప్తున్నారు. ఉరుములు, మెరుపులు మధ్య తేలికపాలు జల్లులు కురుస్తోన్న సమయంలో ఈశ్వర భగవంతుడు కనిపించి కనువిందు చేశాడు. ఆ వీడియో చూసిన వారు, ప్రత్యక్షంగా తిలకించిన వారు శివుడు పేరును రెట్టింపు ఉత్సాహంతో స్మరిస్తున్నారు.

lord shiva Facsimile in sky

ఈ వీడియో ఎక్కడిది అనే వివరాలు తెలియరాలేదు. ఓ ఔత్సాహికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడతో ట్రోల్ అవుతుంది. దానిని చూసిన వారు కూడా తన్మయత్వం పొందుతున్నారు. మరికొందరు తమ ఇష్టదైవం తమ చెంతకే వచ్చాడని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. చూసిన ప్రతీ ఒక్కరు ఓం నమ: శివాయ అంటూ మనసులో ప్రార్థిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వయంగా చూసే అవకాశం రాలేదని .. వీడియో చూసి పుణ్యం కట్టుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి బోనాల పండుగ తర్వాత తెల్లవారి జరిగిన ఈ ఘటనతో శివ భక్తులంతా ఆశ్చర్యానికి గురవుతూనే భోలేనాథ్ రూపంలో ఉన్న శివుడిని దర్శించుకుంటున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా ? లేదంటే కొందరు గ్రాఫిక్స్‌తో వాడారా అనే అంశంపై కూడా స్పష్టత రాలేదు. నిజంగా జరిగి ఉందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరికొందరు తమ స్వార్థం కోసం కూడా చేసి ఉంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

English summary
The form of Lord Shiva reflected in the sky on Monday. Those who saw it praised Hara Hara Mahadeva Shambhosankara. Others have seen the shape of the sky and gained a sense of humor. However, the sentiment of the devotees has doubled after the sighting on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X