వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. చిరుత, క్షణకాలంలో పంజా నుంచి తప్పించుకున్న డ్రైవర్, బతుకుజీవుడా అంటూ..(వీడియో)

|
Google Oneindia TeluguNews

చావుతప్పి కన్నులొట్టబోయింది.. అంటే చావు నుంచి క్షణకాలంలో తప్పించుకున్నారనే సామెత వాడుకుంటాం. పై వీడియోలో లారీ డ్రైవర్ పరిస్థితి అదే. చిరుతపులి దాడి నుంచి క్షణకాలంలో తప్పించుకున్నాడు. బతుకుజీవుడా అంటూ బయటపడి ఊపిరిపీల్చుకున్నాడు. అతని కాలిని పట్టుకొనేందుకు చిరుత ప్రయత్నించగా.. వాయువేగంతో తప్పించుకొని.. గుండెమీద చేయి వేసుకున్నాడు.

Recommended Video

Leopard In Hyderabad CCTV Footage, May Have Escaped To Chilkur Forest
లారీ పార్క్ చేసి..

లారీ పార్క్ చేసి..


కాకినాడకు చెందిన సుభాని.. లారీ డ్రైవర్. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పోలీసుస్టేషన్ పరిధి బుద్వేల్ వద్ద ఆయిల్ ఆన్ లోడింగ్ చేసేందుకు వచ్చాడు. అక్కడ లారీని నిలిపివేసి.. నిరీక్షిస్తున్నాడు. ఇంతలో చిరుతపులిని చూసి గుండె గుబేల్ మంది. క్లీనర్ సహా లారీలో వెళ్లే ప్రయత్నం చేశాడు. మరొకరు లారీ ఎక్కేయగా.. సుభాన్ మాత్రం ఎటు వెళ్లాలో తెలియలేదు. లారీలోకి ఎక్కే సమయంలోని చిరుత వచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ.. ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ అతని కాలి దొరికిపోయింది. దీంతో గుండె ఆగినంద పని అయిపోయింది. వెంటనే కాలును తీసుకొని... లారీకి ఉన్న డోర్ పెట్టుకున్నాడు.

చిరుత..

చిరుత..

ఆ చిరుత గోడ ఎక్కే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే శునకాలు గుమిగూడి అరవడం ప్రారంభించాయి. మొరగడంతో వాటిపై కూడా దాడి చేసే యత్నం చేసింది. ఈ వీడియో చూసిన జనాలకే ఒళ్లు గగుర్పొడుస్తోంది. వీడియో చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

అదేనా ఈ చిరుత...


హైదరాబాద్ శివారు బుద్వేల్ ఫాంహౌస్‌లోకి ఇటీవల చిరుత వెళ్లింది. ఆ చిరుత శుక్రవారం ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను గుర్తించి.. అది వెళ్లిపోయిందని అధికారులు స్పష్టంచేశారు. 50 ఎకరాల అటవీ విస్తీర్ణంలో చిరుత లేదు అని.. నిర్ధారించుకొన్న తర్వాత మీడియాకు తెలియజేశారు. దీంతో స్థానికులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిరుత బుద్వేల్ కాలనీలో కనిపించిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై అటవీశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

English summary
lorry driver escape leopard with a second in budvel colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X