హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంతో లారీ యజమానుల సంఘం చర్చలు సఫలం, సమ్మె విరమణ

లారీల యజమానులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణకు లారీ యజమానులు అంగీకరించారు. లారీ యజమానుల సంఘం 15 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:లారీల యజమానులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణకు లారీ యజమానులు అంగీకరించారు. లారీ యజమానుల సంఘం 15 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు సమ్మె నిర్వహిస్తున్నారు. లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సచివాలయంలో చర్చలు జరిపారు.

ఈ చర్చలు సఫలమయ్యాయి. లారీ యజమానుల సంఘం ప్రతినిధుల 15 డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకొంది. దీంతో లారీ యజమానులు తమ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు.

ఫిట్ నెస్ , డ్రైవింగ్ లైసెన్స్ అంశాల్లో ఉన్న స్లాట్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది.జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

lorry strike

అదే విధంగా పెద్ద అంబర్ పేట వద్ద పదిఎకరాల స్థలంలో పార్కింగ్ కోసం కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.మూసాపేట, కూకట్ పల్లిలో కూడ పార్కింగ్ స్థలాలను ఏర్పాటుు చేసేందుకుగాను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

కొత్తగా ట్రక్ ఆపరేటర్స్ సోసైటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మను విరమిస్తున్నట్టు లారీ యజమానులు ప్రకటించారు.

English summary
lorry owners association strike called off in Telangana state on friday evening. Telangana governament agreed around 15 demands of lorry owners association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X