
విచక్షణ కోల్పోయారా?కోర్ట్ దిక్కరణ వ్యాఖ్యలు ఎలా చేస్తారు.?ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డికి హైకోర్టు ఝలక్.!
హైదరాబాద్ : సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వరిధాన్యం అమ్మకం డీలర్ల సమావేశంలో మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ హైకోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది. కలెక్టర్ హోదాలో ఉండి, ఉన్నత చదువులు చదువుకున్న వారే కోర్ట్ దిక్కరణ వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ప్రశ్నించింది. రోల్ మోడల్ గా ఉండాల్సిన వాళ్లు చవకబారు భాష మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానం ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలిగించినట్టు కాదా అని కోర్ట్ ప్రశ్నించింది. వెంకట్రమి రెడ్డి వ్యాఖ్యలు న్యాయస్ధానాల గౌరవానికి భగం కలిగించేవిగా ఉంటే, కోర్ట్ విలువలను కించపరిచినట్టు భావిస్తే వెంకట్రామి రెడ్డితో క్షమాపణలు చెప్పిస్తామని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.\

ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు కోర్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలా.. వెంకట్రామి రెడ్డిని క్షమాపణ చెప్పాలన్న కోర్టు..
సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో అప్పటి కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సీప్రీం కోర్ట్, హైకోర్ట్ ల గురించి వ్యాఖ్యలు ఆయన మెడకు గుది బండలా చుట్టుకునే ప్రమాదం నెలకొంది. కలెక్టర్ వ్యాఖ్యల నేపథ్యంలో సింగిల్ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామి రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా కలెక్టర్ పై హైకోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చేందుకు తగు సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది.

సంస్కారం లేకుండా మాట్లాడితే ఎలా.? వివరణ కావాలన్న కోర్ట్
సిద్దిపేట మాజీ కలెక్టర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకూ సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో వరి పంట వేయొద్దని చెప్పే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశారు వెంకట్రామిరెడ్డి. వరి విత్తనాలు ఎవరూ అమ్మకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సరే తాను ఖాతరు చేయనని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

క్షమాపణలు చెప్పిస్తాం.. కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్
కలెక్టర్ వ్యాఖ్యల నేపథ్యంలో సింగిల్ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామి రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొంది. అయితే, దీనిపై ప్రభుత్వం తరపు వాదనలు వినిపించే అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తామని, ఆయన స్టేట్మెంట్ నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తామని తెలంగాణ న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

రాజీనామా అమోదంపై కేసు.. వెనక్కు తీసుకున్న పిటీషనర్లు
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామా రెడ్డి రాజీనామా వివాదంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సుబేందర్ సింగ్, జే శంకర్ అనే వ్యక్తులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా, ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌తో ఫలితం లేదని పిటిషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.