వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ "..మరో రెండు పోస్టర్లు ..కాంట్రవర్సీలతో ఆర్జీవీ మర్డర్

|
Google Oneindia TeluguNews

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ, పెళ్లి తర్వాత జరిగిన విషాదాంత గాథ , ప్రణయ్ పరువు హత్య, అమృత తండ్రి ఆత్మహత్య ఆధారంగా సినిమా తీస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ తో మొదలైన కాంట్రవర్సీ తెలిసిందే. ఇక తాజాగా మరో రెండు పోస్టర్లు రిలీజ్ చేసి మరింత అగ్గి రాజేశారు రాం గోపాల్ వర్మ .

అమృతే రాసినా, పనిలేనోడు రాసినా నా ఫైనల్ మెసేజ్ మాత్రం ఇదే : అమృత కామెంట్స్ పై ఆర్జీవీఅమృతే రాసినా, పనిలేనోడు రాసినా నా ఫైనల్ మెసేజ్ మాత్రం ఇదే : అమృత కామెంట్స్ పై ఆర్జీవీ

అమృత వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ .. ఆపై వెంటనే రెండు పోస్టర్లు

అమృత వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ .. ఆపై వెంటనే రెండు పోస్టర్లు

ఫాదర్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మపై , ఆయన తీస్తున్న సినిమా పై తీవ్ర విమర్శలు గుప్పించారు అమృత. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ వ్యాఖ్యానించిన అమృత రాంగోపాల్ వర్మ పై నిప్పులు చెరిగారు. ఇక ఆ తర్వాత అమృత చేసిన, వేరే ఎవరైనా పనికిమాలినోడు రాసినా నా ఫైనల్ మెసేజ్ ఇదే అంటూ అమృత వ్యాఖ్యలపై స్పందించిన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఇక అక్కడితో ఆగకుండా వర్మ మరో రెండు పోస్టర్లు విడుదల చేసి మరింత కాంట్రవర్సి రాజేశారు.

 వర్మ లాజిక్ గా చెప్పినా సినిమా అమృత స్టోరీనే

వర్మ లాజిక్ గా చెప్పినా సినిమా అమృత స్టోరీనే

ఇంతకీ మొదటి పోస్టర్ లో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేసిన వర్మ ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో "మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ" అని పేర్కొన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమానే కానీ ఇది రియల్ స్టోరీ కాదు అంటూ పేర్కొన్న వర్మ, ప్రణయ్, అమృత, మారుతీ రావు ల కథనాన్ని రీల్ స్టోరీ గా మలుస్తున్నాడు అన్నది తాజా పోస్టర్ లను బట్టి ఇట్టే అర్థమవుతుంది.

నెగిటివ్ షేడ్ లో అమృత పాత్ర ?

నెగిటివ్ షేడ్ లో అమృత పాత్ర ?

నేడు మరో రెండు పోస్టర్ లు విడుదల చేసిన వర్మ ఆ పోస్టర్ లో తీవ్ర ఆవేదనతో ఉన్న తండ్రిని, నెగిటివ్ లుక్ లో ఉన్న కూతుర్ని చూపించారు. ఇక మరో పోస్టర్ తీవ్రమైన బాధలో, కళ్ళనిండా నీళ్ళతో ఉన్న తండ్రిని కూతురు ముద్దాడుతున్నట్టు ఉంది. ఇక వర్మ రిలీజ్ చేస్తున్న పోస్టర్లను చూస్తే మాత్రం కూతురు అమృత పాత్రను నెగటివ్ షేడ్ లో చూపిస్తున్నారా అన్న భావన కలుగుతోంది. ఇక ఫాదర్స్ డే రోజున పోస్టర్ విడుదల చేయడంతో ఆ పోస్టర్ ను చూసి అమృత స్పందించడానికి గల కారణం కూడా తనను నెగిటివ్ షేడ్ లో చూపిస్తారనే అనుమానమే అని అర్థమవుతుంది.

 మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ

మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ

ఇక ఇప్పటికే తన సినిమా పై క్లారిటీ ఇచ్చిన వర్మ తాను తీసే సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా తీస్తున్నదే కానీ రియల్ స్టోరీ కాదని పేర్కొన్నారు. అంతేకాదు అసలు చెడ్డ మనుషులనే వారు ఉండాలని, పరిస్థితుల కారణంగా మనుషులు చెడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని, అలాంటి సంఘటనలు మాత్రమే తన మర్డర్ సినిమాలో చూపిస్తున్నా అని పేర్కొన్నారు వర్మ. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లను ఉద్దేశించి మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణయామృత విషాద గాధ అని పేర్కొన్నారు.

ప్రేమ హత్య చెయ్యగలదు అన్న ఆర్జీవీ

ప్రేమ హత్య చెయ్యగలదు అన్న ఆర్జీవీ

ఇక అంతే కాదు అమిత ప్రేమే అమిత ద్వేషానికి కారణం అవుతుందని, అది తీవ్ర హింసకు దారి తీస్తుందని ప్రేమ హత్య చేయగలదు అని తన పోస్టర్ ద్వారా పేర్కొన్నారు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్న వర్మ ఆదినుంచి మూవీ ప్రమోషన్ కాంట్రవర్సీలతో బాగానే చేస్తున్నారు. ఇక ఇటీవల చాలా వరకు వర్మ సినిమాలన్నీ కాంట్రవర్సీ తో ముడిపడి వస్తుండడమే గమనార్హం.

English summary
controversial director RGV released another two posters on murder movie. he mentioned that love can murder . He also mentioned that MURDER is a story of extremes ..EXTREME LOVE resulting in EXTREME HATE and culminating in EXTREME VIOLENCE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X