• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రగ్రహణం.. జర భద్రం..! వీటి జోలికి అస్సలు వెళ్లకండి..!!

|

హైదరాబాద్ : తెలుగు ఆచార వ్యవహారాల పట్ల ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి. అలాగే పండగలు,పబ్బాలు, ఎవరికి నచ్చిన రీతిలో వారు జరుపుకోవడం కూడా ఆనవాయితీనే.. ఇక చంద్రడ్రహాలు, సూర్య గ్రహాలు వచ్చినప్పుడు ఎవరి పవిత్రతను వారు చాటుకుంటారు. చంద్రగ్రహణం సందర్బంగా తెలగు ప్రజలు ఎవరికి తోచిన విశ్వాసం ప్రకారం వారు నడుచుకుంటున్నారు. కొందరైతే కొన్ని వ్యవహారాలకు చాలా దూరంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. నేడు చంద్రగ్రహణం కాగా ఈ ఏడాదిలో వచ్చిన రెండో చంద్రగ్రహణం ఇది. బుధవారం వేకువజామున 1.31 నుంచి ఉదయం 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ రోజు ఏ ఏ పనులు చేయాలి మరియు ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. అలానే ఏ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

చంద్రగ్రహణం..! రాశుల వారిగా అప్రమత్తమైన తెలుగు ప్రజానికం..!!

చంద్రగ్రహణం..! రాశుల వారిగా అప్రమత్తమైన తెలుగు ప్రజానికం..!!

వికారినామ సంవత్సర ఆషాడ శుద్ద పౌర్ణమి 16 - 07 - 19 మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రము నందు ధనస్సు మరియు మకర రాశి - ఉత్తరాషాడ నక్షత్రము నందు కేతు గ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి 1.30 ధనుస్సు రాశి ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో ప్రారంభమై తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశి ఉత్తరాషాడ రెండో పాదంలో ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని ధనుర్ రాశీ,మకర రాశీ వారు చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఖండగ్రాస కేతు గ్రస్త చంద్రగ్రహణమని జ్యోతిషులు పేర్కొంటున్నారు. మాల,పూర్వాషాఢ,ఉత్తరశాడా,శ్రవణం నక్షత్రాల వారు శాంతుల చేసుకోవాలి.

నిష్టగా ఉపవాసాలు..! అపవిత్ర పనులకు దూరం..!!

నిష్టగా ఉపవాసాలు..! అపవిత్ర పనులకు దూరం..!!

గ్రహణ కాలంలో ఎటువంటు ద్రవ ఆహార పదార్థాలు స్వీకరించరాదని చెబుతున్నారు. గ్రహణ మొక్ష కాలము తర్వాత స్నాన పూజాది కార్యక్రమాలు చేసి ఏమైనా తినవచ్చు. గ్రహణము కంటే ముందుగా వండిన పదార్థాలు గ్రహణ కాలములో చేసినవి తినకూడదు. దేవాలయం మరియు పూజ ప్రతిమలను కూడా ముట్టుకోరాదు. గ్రహణ కాలములో లైంగిక సంపర్గము , ఏ కారణము వలనైన అలంకారము చేయరాదు.

దాన ధర్మాలకు పెద్ద పీఠ..! కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు..!!

దాన ధర్మాలకు పెద్ద పీఠ..! కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు..!!

కర్కాటక , తుల , కుంభ , మీన రాశుల వారికి శుభపలం కలగనుంది. మేష , మిథున , సింహ , వృశ్చిక రాశుల వారికి మిశ్రమ ఫలం దక్కనుంది. వృషభ , ధనస్సు , కన్యా , మకర రాశుల వారికి అశుభ ఫలం కలగనుంది. ఇక చంద్రగ్రహణం రోజున బియ్యం , ఉలవలు దానం చేయడం మంచింది. దీంతో పాటు... రాహు,కేతు నాగ పడగలు, రాగిపళ్ళెము, అవునెయ్యి వీటితో దక్షిణ సమేతముగా దానము చేస్తే మంచి జరుగుతోంది.

 గ్రహణ దృష్టి తొలగించుకునే మార్గాలు..! ముందస్తు జాగ్రత్తలో ప్రజలు..!!

గ్రహణ దృష్టి తొలగించుకునే మార్గాలు..! ముందస్తు జాగ్రత్తలో ప్రజలు..!!

ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం 149 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున సంభవించడం విశేషం.

English summary
Today it is the second lunar eclipse of the year. A lunar eclipse will occur from 1.31 am to 4.29 am on Wednesday. But let's learn what works today and what doesn't. And let's try to find out what the results of any of the constellations.!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X