వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సమస్య ఉంటే ఇబ్బందులు, కరోనాపై మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇతర వ్యాధులు ఉన్నవారిపై వైరస్ వేగంగా ప్రభావం చూపుతోందని అంగీకరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి వెంటనే గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చని.. ఆలస్యమైతే కష్టమని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా జ్వరం వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలని కోరారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

lung disease person more effect coronavirus..

Recommended Video

Rajendra Prasad Launches Zoono Z71 Microbe Sheid Surface Sanitizer

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో వైరస్ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులను కూడా వైరస్ వదలడం లేదు. గత 24 గంటల్లో 1554 మందికి పాజిటివ్ సోకగా.. వైరస్ వచ్చిన 9 మంది చనిపోయారు.

English summary
lung disease person more effect coronavirus telangana health minister etela rajender said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X