తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దయచేసి వినండి ... తెలుగు రాష్ట్రాల్లో ఇక నుండి లగ్జరీ ప్రైవేట్ రైళ్ళు

|
Google Oneindia TeluguNews

దయచేసి వినండి .. ఇక నుండి దక్షిణ మధ్య రైల్వేలో లగ్జరీ ప్రైవేట్ రైళ్ళు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ విషయాన్ని ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే . ఇంతకీ తెలుగు రాష్ట్రాల మధ్య ఏ ఏ మార్గాల్లో ప్రైవేట్ రైళ్ళు నడపనున్నారు .. ఇక రైళ్ళలో సౌకర్యాలు ఎలా ఉంటాయి అంటే ..

Recommended Video

Luxury Private Trains In Telugu States Soon! | Oneindia Telugu
దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ రైళ్ళు

దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ రైళ్ళు

ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించటం కోసం, అలాగే వారి ప్రయాణ అవసరాలు తీర్చటం కోసం రైల్వే లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తుంది కేంద్ర సర్కార్ . ఇక ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్‌ రైళ్ల రాకపోకలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

రైల్వేలో పెట్టుబడులకు పోటీ పడుతున్న విదేశీ సంస్థలు

రైల్వేలో పెట్టుబడులకు పోటీ పడుతున్న విదేశీ సంస్థలు

ఇక దీంతో రైల్వేలో పెట్టుబడులు పెట్టటానికి విదేశీ సంస్థలు చాలా పోటీ పడుతున్నాయి. రైల్వేల్లో పెట్టుబడి కోసం విదేశీ సంస్థలపైన హ్యూండాయ్, సీమెన్స్, ఆల్స్ట్రామ్ ఆసక్తి కనబరుస్తున్నట్లు రైల్వే వర్గాలు చెప్తున్నాయి . దేశీయ సంస్థలైన టాటా, అదానీ గ్రూప్‌లు కూడా ప్రైవేటు రైళ్ళు నిర్వహించే ఆలోచనలో ఉన్నాయి . ఇక ప్రైవేట్ రైళ్ళలో కూడా అన్నీ లగ్జరీ సదుపాయాలు కల్పించే ఆలోచనలో ఉన్నారు .ప్రైవేట్‌ రైళ్లలో సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

లగ్జరీ రైళ్ళు ... రైల్ హోస్టెస్ లు కూడా

లగ్జరీ రైళ్ళు ... రైల్ హోస్టెస్ లు కూడా

విమానాల తరహాలో అత్యంత ఖరీదైన వసతులతో పాటు రైల్‌ హోస్టెస్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాదు ఈ రైళ్ళ నిర్వహణకు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమాతో పాటూ మిగిలిన సౌకర్యాల బాధ్యత మొత్తం ప్రైవేటు ఆపరేటర్లే చూసుకోవాల్సి ఉంటుంది . ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ నేపధ్యంలో పలు రైల్వే మార్గాల్లో ప్రైవేట్ రైళ్లకు అవకాశం కల్పిస్తుంది .

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 5 రూట్లు

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 5 రూట్లు


సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లనే రైల్వే శాఖాధికారులు ప్రైవేటు రైళ్ల నిర్వహణకు ఎంపిక చేశారు. చర్లపల్లి - శ్రీకాకుళం, గుంటూరు - లింగంపల్లి, లింగంపల్లి - తిరుపతిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ - విశాఖతో పాటూ, విశాఖ - తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకు సిద్దం అవుతున్నారు.

22 వేల 500 కోట్ల పెట్టుబడితో ప్రవేట్ రైళ్ళు

22 వేల 500 కోట్ల పెట్టుబడితో ప్రవేట్ రైళ్ళు

22 వేల 500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఢిల్లీ - లక్నో మధ్య తేజస్‌ ప్రైవేట్‌ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో ప్రైవేట్‌ రైలు అహ్మదాబాద్‌- ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ రైళ్ళు అందుబాటులోకి రానున్నాయి.

English summary
Secunderabad Zone has five routes related to AP. Railway operators have opted to operate private trains as the demand for commuters is high. Daily trains will run between Charlapalli - Srikakulam, Lingampally - Tirupati, Guntur - Lingampally. Tri-weekly private trains between Visakha and vijayawada, Visakha andTirupati are ready to run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X