• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: నగరంలో పర్యాటకం కొత్త శోభను సంతరించుకుంటోంది. ఆకాశంలో విహరించేందుకు హెలి టూరిజం... హుస్సేన్ సాగర్‌లో విహరించేందుకు సరికొత్త అవకాశాలను కల్పిస్తోంది. హూస్సేన్ సాగర్ అలలపై విహరించేందుకు మరో రెండు వాహనాలు కొనుగోలు చేసింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ.

టీఎస్‌టీడీసీ కొనుగోలు చేసిన అమెరికా తయారీ కెటమరన్ యాచ్ బోట్‌లను బుధవారం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియామిర్జా హుస్సేన్‌సాగర్ బోటింగ్ యూనిట్‌లో ప్రారంభించారు. ఈ అత్యాధునిక బోట్‌లలో 12నుంచి 15మంది ప్రయాణం చేయవచ్చు. టీఎస్‌టీడీసీ ఇందుకోసం లగ్జరీ రైడ్ ప్యాకేజీలను రూపొందిస్తోంది.

సాగర అలలపై ఫ్యామిలీతో కలిసి సరదాగా చెక్కర్లు కొట్టే అవకాశాన్ని కల్పిస్తూ ప్రారంభించిన ఈ బోట్లలో ప్రయాణానికి ఒక్కొక్కరి కేవలం రూ.100 మాత్రమే చార్జి చేస్తుండడం గమనార్హం. కొత్తగా కొనుగోలు చేసిన ఈ బోట్లతో కలిసి నగరంలోని పలు సరస్సులో టీఎస్‌టీడీసీ 95 బోట్లను నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా సానియామిర్జా, టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు హుస్సేన్‌సాగర్‌లో పర్యటించారు. బోట్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సానియా మిర్జా మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని అన్నారు.

వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు, వైల్డ్ లైఫ్ టూరిజం దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనంగా విరాజిల్లుతోందని, ఇక్కడి నవాబీ సంస్కృతి, వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తాను ఇలాంటి వైభవోపేత నగర పౌరురాలిగా ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు.

 హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా


తెలంగాణలో అటవీ సంపద, జలపాతాలు, మైదానాలు, చారిత్రక కట్టడాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. తన టెన్నిస్ పార్ట్‌నర్ మార్టినా హింగిస్‌ను ఈ సారి తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు తీసుకువస్తానన్నారు.

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ 60ఏండ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో సంస్కృతి అణచివేతకు గురైందన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని వెలికితీసి ప్రపంచానికి చాటేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందన్నారు.
 హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

ఇక్కడి ఆదివాసీ కళారూపాలు, వంటలు, పండుగలు అన్నింటికి అధిక ప్రాధాన్యతనిచ్చి వెలుగులోకి తీసుకురానున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం కేటాయించిన రూ.100 కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాలోని మల్లెల తీర్థం, సోమశిల, అక్కమహాదేవి గుహలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

 హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా

హైదరాబాదీ అయినందకు గర్విస్తున్నా: సాగర్‌లో సానియా


రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహకరిస్తోందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా, సంస్థ మేనేజర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
In another move to attract tourists, the Telangana State Tourism Development Corporation (TSTDC) on Wednesday launched two new catamaran yachts in Hussain Sagar lake here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X