• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

MAA elections 2021: మెగా కాంపౌండ్ కీ రోల్: చిరంజీవి సపోర్ట్ ఎవరికో తేల్చేసిన నాగబాబు

|

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థాయి సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)లోో ఎన్నికల వేడి రాజుకుంది. టాలీవుడ్‌కు చెందిన బిగ్ షాట్స్ ఇందులో తలపడుతోన్నాయి. సాధారణంగా మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆ హీట్ ఏర్పడుతుంటుంది. ఈ సారి కూడా మెగా కాంపౌండ్ ఎంట్రీ ఇవ్వడం మరింత ఊపునిచ్చినట్టయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సారి ఎవరికి మద్దతు ఇస్తారనే ఉత్కంఠత రెండురోజులుగా ఫిల్మ్‌నగర్‌లో నెలకొంది. తాజాగా దీనికి తెర పడింది. చిరంజీవి- ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు తన మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు, నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు.

  MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight| Oneindia Telugu
  మంచు విష్ణుకు సపోర్ట్ ఇవ్వొచ్చంటూ..

  మంచు విష్ణుకు సపోర్ట్ ఇవ్వొచ్చంటూ..

  తొలుత మెగాస్టార్ చిరంజీవి.. మంచు విష్ణు వైపు మొగ్గు చూపొచ్చనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. దీనికి కారణాలు లేకపోలేదు. మంచు విష్ణు, ఆయన తండ్రి సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సమయంలో- ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం పట్ల చిరంజీవి మొదటి నుంచీ సానుకూలంగా వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. మొన్నటి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌ సందర్భంగా కూడా ఆయన వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

  నాగబాబు ప్రకటనతో తెర..

  నాగబాబు ప్రకటనతో తెర..

  దీన్ని దృష్టిలో ఉంచుకుని- చిరంజీవి మంచు కుటుంబం వైపు నిల్చుంటారనే వార్తలు మొదట్లో వెలువడ్డాయి గానీ.. అవేవీ సరికాదంటూ తాజాగా నాగబాబు చేసిన ప్రకటన స్పష్టం చేసినట్టయింది. మెగా కాంపౌండ్‌‌కు హెడ్ చిరంజీవి. ఆయన తరువాతే ఇంకెవరైనా. మా ఎన్నికల్లో చిరంజీవి.. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు ఇస్తారంటూ నాగబాబు తేల్చేయడంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి ఇప్పటిదాకా మా ఎన్నికల గురించి ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ- ఆయన సోదరుడే ఆ విషయాన్ని తేల్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని ఆధారంగా చేసుకుని చూస్తే- మెగా కాంపౌండ్ మొత్తం ప్రకాష్ రాజ్ ప్యానెల్ వైపే ఉంటారనేది కూడా స్పష్టమైంది.

  ప్రకాష్ రాజ్ నాన్ లోకలా?

  ప్రకాష్ రాజ్ నాన్ లోకలా?

  ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఆయన స్వతహాగా కన్నడిగుడు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. దక్షిణాదిన చలన చిత్ర పరిశ్రమలన్నీ ఆయనను తమ వాడిగా ఆదరిస్తాయి. కళలకు, కళాకారుడికి హద్దులనేవి ఉండవనేది ప్రకాష్ రాజ్ వాదన. టాలీవుడ్ నుంచి ఏకంగా తొమ్మిది సార్లు నంది అవార్డును అందుకున్నానని, అప్పట్లో తలెత్తని స్థానికేతరుడనే విషయం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నిస్తోన్నారు. నాగబాబు సైతం ఇదే విషయాన్ని ప్రస్తవిస్తోన్నారు.

  పదవి కోసం కాదు: ప్రకాష్ రాజ్

  పదవి కోసం కాదు: ప్రకాష్ రాజ్

  తాను పదవి కోసం మా అధ్యక్షుడిగా పోటీ చేయట్లేదని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. తనను నాన్‌ లోకల్‌గా అభివర్ణించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఓ కళాకారుడికి, నటుడికి నాన్ లోకల్‌ను అపాదించడం సంకుచితమైన ఆలోచనగా పేర్కొన్నారు. తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకుని, అభివృద్ధి చేయిస్తోన్నానని గుర్తు చేశారు. తప్పు చేస్తే.. అధ్యక్షుడినైనా నిలదీసే మనస్తత్వం.. ప్రశ్నించే గుణం ఉన్న వారు తన ప్యానెల్‌లో ఉన్నారని చెప్పారు.

  తాను తప్పు చేస్తే బయటికి పంపించేస్తారని పేర్కొన్నారు. ఆవేదనతో పుట్టిన సినిమా ప్యానెల్‌గా చెప్పారాయన. మాలో పోటీ చేయాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. చాన్నాళ్ల కిందటే తాను దీనిపై ఓ నిర్ణయానికి వచ్చానని, అప్పట్లోనే తన ఆలోచనలను పంచుకున్నానని స్పష్టం చేశారు.

  English summary
  MAA Elections 2021:Megastar Chiranjeevi supports Prakashraj panel
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X