హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ సునీత మృతి- ట్విస్ట్: ప్రేమించకుంటే చస్తానని అతనికి బెదిరింపు?

హత్యకు గురైన టెక్కీ సునీత మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెది ఆత్మహత్యా? హత్యా? అన్నది సందిగ్ధత నెలకొంది. మృతురాలి సిమ్ కార్డు ఆధారంగా కాల్ లిస్ట్, వాట్సాప్‌ మెసేజ్‌లను పోలీసులు సేకరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హత్యకు గురైన టెక్కీ సునీత మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెది ఆత్మహత్యా? హత్యా? అన్నది సందిగ్ధత నెలకొంది. మృతురాలి సిమ్ కార్డు ఆధారంగా కాల్ లిస్ట్, వాట్సాప్‌ మెసేజ్‌లను పోలీసులు సేకరించారు. దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆమె ఎక్కువసార్లు మాట్లాడిన కూకట్‌పల్లికి చెందిన స్నేహితుడిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని విచారించారని సమాచారం. ఇతను గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌లోని ఓ కంపెనీలో టెలీకాలర్‌గా పని చేస్తున్నాడు.

<strong>టెక్కీ సునీత హత్య మిస్టరీ: మొబైల్ ఇంట్లోనే, కైనెటిక్ హోండాపై వెళ్తూ...</strong>టెక్కీ సునీత హత్య మిస్టరీ: మొబైల్ ఇంట్లోనే, కైనెటిక్ హోండాపై వెళ్తూ...

కూకట్‌పల్లి నుంచి గచ్చిబౌలిలోని తాను పనిచేసే కంపెనీకి వెళ్లే ఇతను సునీతను మాదాపూర్‌ భాగ్యనగర్‌ సహకార సొసైటీ రోడ్డులో కలుసుకునేవాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ నెల 13న కూడా కలిసినట్లుగా గుర్తించారు.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందా?

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందా?

ఆ తర్వాత రోజు ప్రేమికుల దినోత్సవం. తన ప్రేమను అంగీకరించాలని సునీత తనకు చెప్పిందని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించిందని అతను పోలీసుల విచారణలో వెల్లడించారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ సందేశం కూడా..

వాట్సాప్ సందేశం కూడా..

ఈ విషయాన్ని సునీత వాట్సాప్‌లోనూ అతనికి పంపించిందని తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆమె నంబరు బ్లాక్‌ చేసి 14, 15 తేదీల్లో సునీతను కలవకుండా తప్పించుకున్నాడని తెలుస్తోంది.

సీసీటీవీ ఫుటేజీలో..

సీసీటీవీ ఫుటేజీలో..

ఇదిలా ఉండగా, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు సికింద్రాబాద్‌లో ఆమె ఓ తెల్లటి డబ్బాను పట్టుకొని తిరిగినట్లుగా ఉందని తెలుస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తి నుంచి కోరుకున్న సమాధానం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనీ పోలీసులు అనుమానిస్తున్నారు.

పలు కోణాల్లో పోలీసుల దర్యాఫ్తు

పలు కోణాల్లో పోలీసుల దర్యాఫ్తు

తరచూ కలుసుకునే ప్రాంతానికి కిరోసిన్‌ డబ్బాతో వచ్చి బలవన్మరణానికి పాల్పడిందా లేక ఎవరైనా ప్రేమ పేరుతో సునీతను ఇక్కడికి రప్పించి గొంతు నులుమి హత్య చేసి కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి ఉంటారా? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Police recovered a partially burnt body of a woman, police identified the deceased as Sunitha, a software professional working.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X