హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోషల్ మీడియాలో వేధింపులు: సీపీ సజ్జనార్‌కు బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోషల్ మీడియాలో కొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటి, బీజేపీ నేత మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గురువారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత మాధవీలత మీడియాతో మాట్లాడారు. ఓ వర్గం సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతోందన్నారు. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో తాను కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దారుణాలపై ఇంతకాలం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేసినట్లు మాధవీలత తెలిపారు.

madhavi latha files case against social media posts

ఇప్పుడు జరుగుతున్న ప్రచారం తనను మానసికంగా మరింత కుంగదీస్తోందని, అందుకే తాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అభ్యంతరకర పోస్టులు పెడుతూ వేధిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు మాధవీలత తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

రుణయాప్‌ల హైకోర్టు ఆదేశాలు
రుణయాప్(loan apps)లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు యాప్‌లను తొలగించేందుకు ప్లేస్టోర్‌ను సంప్రదించాలని సూచించింది. లోన్ యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. చైనా లోన్ యాప్‌ల వల్ల వందలాది మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా రుణయాప్‌ల కేసులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

English summary
madhavi latha files case against social media posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X