• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెల్లె.. కల్వకుంట్ల కవిత కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఆ పని చెయ్: మధుయాష్కీ చురకలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మాటలతో చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకపక్క బిజెపిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్, టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా రైస్ వార్ లోకి దిగింది.

 రాహుల్ గాంధీ ట్వీట్ తో మొదలైన రగడ

రాహుల్ గాంధీ ట్వీట్ తో మొదలైన రగడ


తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగు చేసిన ప్రతి బియ్యం గింజ కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభపెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు.

 కవిత ట్వీట్ తో కొత్త రూట్ లోకి వెళ్ళిన పంచాయితీ

కవిత ట్వీట్ తో కొత్త రూట్ లోకి వెళ్ళిన పంచాయితీ


ఇక ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ రివర్స్ ఎటాక్ చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ రాజకీయ లబ్దికోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలియ కుండా ధాన్యం కొనుగోలు కోసం ఆందోళన చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి నిరసన తెలియజేయాలని దేశమంతా ఒకే సేకరణ విధానం ఉండేలా కేంద్రం పై పోరాటం చేయాలని సూచించారు.

 కవిత ను టార్గెట్ చేస్తూ మధుయాష్కీ ట్వీట్

కవిత ను టార్గెట్ చేస్తూ మధుయాష్కీ ట్వీట్


దీనిపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తమదైన శైలిలో స్పందించారు. ఇక తాజాగా కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పందించారు.చెల్లె .. కల్వకుంట్ల కవిత 2014లో ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి మొత్తానికి మొత్తంగా మూసేసి రైతులకు, కార్మికులకు పంగనామాలు పెడితివి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పసుపు బోర్డు తెస్తా .. ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తా అన్నట్టే మీ ఎంపీల డ్రామాలు : మధు యాష్కీ

పసుపు బోర్డు తెస్తా .. ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తా అన్నట్టే మీ ఎంపీల డ్రామాలు : మధు యాష్కీ


అంతేకాదు పసుపు బోర్డు తెస్తాను... ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తానన్న నమూనాలోనే మీ ఎంపీలు ధర్నా డ్రామాలు చేస్తున్నారు చెల్లె అంటూ మధుయాష్కిగౌడ్ టీఆర్ఎస్ ఎంపీల తీరును చెప్పి, కవితను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్నడు ధాన్యం కొనుగోలు సమస్య రాలేదని పేర్కొన్న మధుయష్కిగౌడ్ మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో లేని సమస్య తెలంగాణలో ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు.

కల్లబొల్లి మాటలు కట్టిపెట్టు కవిత

కల్లబొల్లి మాటలు కట్టిపెట్టు కవిత

కల్వకుంట్ల కవిత కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి , కల్లాలలో ధాన్యం గింజలపై ప్రాణాలు వదిలేస్తున్న పేద రైతుల ప్రాణాలు కాపాడు అంటూ మధుయాష్కిగౌడ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ పోస్ట్ తో మొదలైన కొత్త రచ్చ ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీపై చేసిన మాటల దాడితో, ఆమెను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శలు చేసే దాకా వెళ్లింది. టీఆర్ఎస్ పాలనలో చేస్తున్న తప్పులను ఎత్తి చూపే దాకా వెళ్ళింది.

English summary
The tweet war over paddy purchase. Congress campaign committee chairman Madhu Yashki Goud slammed MLC Kavitha remarks on Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X