• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రోళ్లపై ఇవి నిజం కాదా, కేసీఆర్ ఫ్యామిలీ లాగు తడుస్తోంది: యాష్కీ, కవిత-కేటీఆర్‌పై తీవ్రవ్యాఖ్యలు

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నిజాంపేటలో మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సోమవారం స్పందించారు. ఓటమి భయంతోనే కేటీఆర్ తాము ఆంధ్రావాళ్లకు అండగా ఉంటామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీకి కేసీఆర్ అందుకే ఏమివ్వలేదు, బాబు రైట్.. తప్పుబట్టలేం, అదే కోపం, హరికృష్ణ చనిపోయినప్పుడు:కేటీఆర్ఏపీకి కేసీఆర్ అందుకే ఏమివ్వలేదు, బాబు రైట్.. తప్పుబట్టలేం, అదే కోపం, హరికృష్ణ చనిపోయినప్పుడు:కేటీఆర్

ఓటమి కళ్లముందే కనిపిస్తుంటే కేసీఆర్ కుటుంబానికి లాగులు తడుస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రేమలో కేసీఆర్ గుడ్డివాడు అయ్యారని ఆరోపించారు. నిన్నటి వరకు సీమాంధ్రులను కేసీఆర్ తిట్టిన విషయం కేటీఆర్‌కు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. మీ నోళ్లు కంపు కొడుతున్నాయన్నారు. ఈ ఆంధ్రా వాళ్లూ తూ అని ఊంచితే వెళ్లలేదని చెప్పింది నిజం కాదా అన్నారు.

కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు

కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు

ఓటమి భయం కారణంగానే ఆంధ్రవాళ్లకు అండగా ఉంటానని కేటీఆర్ చెప్పారని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ కొడుకుగా ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటానని కేటీఆర్ చెప్పారు, అతను (ఈ బెత్తం గాడు అంటూ) నోరు విప్పితే అబద్దాలు అని, మూసీ నది కంటే కంపు కొడుతుందని, కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్దాలకు మారుపేరు అన్నారు. నేను మూడో కన్ను తెరిస్తే అని ఇటీవల చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ అన్నారని, కానీ ఆయన మూడో పెగ్గు అనబోయి మూడో కన్ను అన్నారని ఎద్దేవా చేశారు. భారత ఉపరాష్ట్రపతే కంటి పరీక్ష కోసం హైదరాబాద్ వస్తే కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్తారా అన్నారు.

ఛీ అని ముఖంపై ఊంచినా ఆంధ్రోళ్లు వెళ్లడం లేదన్నది నిజం కాదా?

ఛీ అని ముఖంపై ఊంచినా ఆంధ్రోళ్లు వెళ్లడం లేదన్నది నిజం కాదా?

కలియుగంలో రాక్షసులు ఎవరైనా ఉంటే ఏపీలో పుడతారని, ఏపీలోని వారంతా రాక్షసులు అని ఆరోపించారని, తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకు తిన్నారని, ఛీ అని ముఖంపై ఊంచితే ఈ ఆంధ్రోళ్లకు సిగ్గు శరం లేదని, పోవట్లేదని చెప్పింది నిజం కాదా అని మధుయాష్కీ అన్నారు. ఆంధ్రావాళ్లు దోచుకుంటుందని ఆరోపించింది నిజం కాదా అన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడగానే ఏపీ నుంచి వచ్చిన పేద పిల్లల ఫీజు రీయింబర్సుమెంట్ లేకుండా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబును పొగిడావు కదా

చంద్రబాబును పొగిడావు కదా

మీ బావ అబద్దాల హరీష్ రావు కాంగ్రెస్ ఆంధ్రావాళ్లకు పని చేస్తుందని చెప్పారని, అందుకే కాంగ్రెస్‌ను ఓడించాలని ఆయన చెప్పారని, ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండిస్తున్నారా చెప్పాలని యాష్కీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఐటీ అభివృద్ధి మేం చేసింది కాదని, చంద్రబాబు చేసిందని కేటీఆరే చెప్పారని గుర్తు చేశారు. ఓటమి నుంచి ఇప్పుడు రక్షించుకోవడానికి అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రుల ఓట్లు లేకుంటే ఓడిపోతామని కపటప్రేమ నటిస్తున్నారన్నారు.

వీడు అక్రమాస్తుల కోసం రంగులు మారుస్తాడని సిగ్గుపడుతున్నాయి

వీడు అక్రమాస్తుల కోసం రంగులు మారుస్తాడని సిగ్గుపడుతున్నాయి

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఆంధ్రా ప్రజలకు ముల్లు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని కేసీఆర్ చెప్పారని, అమరావతికి వెళ్లి రొయ్యల కూర, నువ్వుల చారు తాగి వచ్చి, నా తెలంగాణలోని ఎల్లమ్మ, పోచమ్మ గుళ్లకు చేసిన సహాయం లేదన్నారు. కానీ ఇప్పుడు ఓడిపోతున్నామని భయపడి ఆంధ్రావాళ్లకు అండగా ఉంటామని కోతలరాయుడు, పాతాల రాముడు అయిన అదే రావు.. మిస్టర్ కేటీఆర్ వేషాలు చూసి ఊసరవెళ్లి మాటలు చూసి అవి సిగ్గుపడుతున్నాయన్నారు. మేం బతకడానికి రంగు మార్చుకుంటే వీడు రోజూ అక్రమాస్తులు సంపాదించుకునేందుకు ఆంధ్రులను ఆదుకుంటానని చెబుతున్నాడని అనుకుంటున్నాయన్నారు.

నీ చెల్లి కవిత తెలంగాణ శశికళ

నీ చెల్లి కవిత తెలంగాణ శశికళ

మీ చెల్లి కల్వకుంట్ల కవిత అవినీతిలో తెలంగాణలో శశికళను మించిపోయిందని యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని యాష్కీ ఆరోపించారు. అక్రమార్జనలో తమిళనాడు శశికళను మించిపోతే, కేటీఆర్ తన బావమరిది పేరు మీద అక్రమ ఫాంహౌస్‌లు, ప్రయివేటు విమానాలు, ఆయన ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్‌గా అయ్యారో, క్లబ్బులు, పబ్బులు మీ వాటాల మాటా ఏమిటని ప్రశ్నించారు.

English summary
Congress party leader and Former MP Madhu Yashki hot comments on Telangana Minister KTR and MP Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X