మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుతపులి జాడను వెతుక్కుంటూ.. అడవిలోకి వెళ్లిన ఎమ్మెల్సీ..!

|
Google Oneindia TeluguNews

కల్వకుర్తి : కొందరు ప్రజా ప్రతినిధులు ప్రజల మనిషిగా ముద్రపడాలని తాపత్రాయపడుతుంటారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటారు. అదే కోవలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేసిన ఓ పని ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని ఎక్వాయిపల్లికి చెందిన రైతు పుట్ట యాదయ్య.. లేగదూడను తన పొలంలోని పాకలో కట్టేశాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున చిరుత పులి దాడి చేసింది. దాంతో ఆ లేగదూడ విగతజీవిగా మారింది. ఆ తర్వాత దాదాపు కిలోమీటర్ మేర సమీపంలోని అడవికి లాక్కెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి.

8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు

mahabubnagar district mlc kasireddy narayana reddy in forest

అదలావుంటే లేగదూడపై చిరుతపులి దాడి చేసిందనే సమాచారం తెలిసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి.. ఆదివారం ఉదయం పుట్ట యాదయ్య పొలం దగ్గరకు చేరుకున్నారు. అతడితో చాలా సేపు మాట్లాడి అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకున్నారు.

సదరు రైతు చెప్పిన వివరాల మేరకు అడవి బాట పట్టారు కసిరెడ్డి. లేగదూడను చిరుతపులి లాక్కెళ్లిన ఆనవాళ్లను అనుసరిస్తూ అడవిలోకి దారి తీశారు. రైతులతో కలిసి దాదాపు కిలోమీటర్ మీర కాలి నడకన అడవిలో నడిచారు. ఎట్టకేలకు లేగదూడ కళేబరం జాడ కనుక్కున్నారు. అనంతరం అధికారులకు ఫోన్ చేసి చిరుతపులిని బంధించాలని సూచించారు.

English summary
Mahabubnagar district MLC Kasireddy Narayana Reddy Went to Forest. In Kadtal Mandal One Calf died due to tiger attack. Kasireddy Narayan Reddy went to spot and he observed how the tiger attacked, for that he went to forest. He Called Officials and said that to catch the tiger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X