ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌కౌంటర్: ఆదిలాబాద్ మావో కీలక నేతతోపాటు ముగ్గురు మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గడ్చిరోలి/ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాటేపెల్లి అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు.

మృతుల్లో మావోయిస్టు ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్‌ (చార్లెస్‌), మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్, ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడు దినేష్ ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకితోపాటు రెండు మందుగుండు సామగ్రి డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అత్రం శోభన్ అలియాస్ చార్లెస్ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆదిలాబాద్ జిల్లా మంగి కమిటీ ఏరియా కార్యదర్శిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. తిర్యాని మండలం రొంపెల్లికి చెందిన శోభన్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోగా తాతవద్ద ఉండి 8వ తరగతి వరకు చదివాడు.

2004లో ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన శోభన్ గత ఏడాది అక్టోబర్‌లో తిర్యాణి మండలం కైరిగూడలో ఇన్‌ఫార్మర్ నెపంతో బల్లార్ష అనే గిరిజనుడిని కాల్చిచంపిన సంఘటన అలజడి రేపింది. శోభన్‌పై 20 కేసులు నమోదుకాగా, ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

ఇదిలావుంటే ఎన్‌కౌంటర్ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ గ్రేహౌండ్స్ దళాలకు చెందిన 63మంది పోలీసులు ప్రాణహిత తీరంలో జల్లెడపడుతూ వలలో చిక్కిన ముగ్గురు మావోలను వ్యూహాత్మకంగానే మట్టుబెట్టినట్టు ప్రచారం సాగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌గా భావించే ప్రాణహిత తీరంలో గత ఆరు నెలలుగా నక్సల్స్ పోలీసుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ సరిహద్దు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.

మరోవైపు ఇదే ప్రాంతంలోని బెజ్జూర్ మండలంలోని గూడెం వంతెన నిర్మాణ పనులను నక్సల్స్ అడ్డగించి గత ఏప్రిల్ 26న భారీ యంత్రాలను దగ్ధం చేయడంతో తెలంగాణ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. గూడెం వంతెన వద్ద మావోల విధ్వంస సంఘటన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సజ్జనార్, నవీన్‌చంద్, స్టిఫెన్ రవీంద్ర తదితరులు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించి వ్యూహాత్మకంగా నిఘా ముమ్మరం చేశారు.

జిల్లా ఎస్పీగా పనిచేసిన తరుణ్ జోషీ ఇటీవలే గ్రేహౌండ్స్ కమాండర్‌గా బదిలీపై వెళ్లగా గోదావరి ఖనిలో తిష్టవేసి ఎన్‌కౌంటర్‌కు పథకరచన గావించినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా అందులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా కీలక నేతలు ఉండటంతో జిల్లా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

ఆత్రం శోభన్

ఆత్రం శోభన్

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాటేపెల్లి అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు.

ఆత్రం శోభన్

ఆత్రం శోభన్

మృతుల్లో మావోయిస్టు ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్‌ (చార్లెస్‌), మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్, ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడు దినేష్ ఉన్నారు.

ముకేష్

ముకేష్

ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకితోపాటు రెండు మందుగుండు సామగ్రి డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మావోల మృతదేహాలు

మావోల మృతదేహాలు

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అత్రం శోభన్ అలియాస్ చార్లెస్ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆదిలాబాద్ జిల్లా మంగి కమిటీ ఏరియా కార్యదర్శిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

English summary
Three Maoists were killed on Sunday in an encounter with security forces at Venkatapur area on Maharashtra-Telangana border, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X