హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ, సూత్రధారి మేనేజరే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని బిస్-సీలో నగదు కొల్లగొట్టేందుకే ఇద్దరు నిందితులు కర్ణాటక నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. మాదాపూర్ బిగ్-సిలో మేనేజర్‌గా పనిచేసే మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ సమీ పథక రచన చేశాడు. సూత్రధారిగా వెనుక నుంచి కథ నడిపించాడు.

ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటాడి పట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎల్ అండ్ టీ ఉద్యోగి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

శుక్రవారం విలేకరుల సమావేశంలో గుల్బార్గా గ్యాంగ్‌ను ఏవిధంగా నగర పోలీసులు పట్టుకున్నారో ఆయన వివరించారు. గుల్బర్గా గ్యాంగ్‌ను పట్టుకున్న వారికి సీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. వారికి నగదు బహుమతులు కూడా అందజేశారు.

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు నగరంలో గుల్బార్గా ఎంట్రీ అయ్యిందని ఫిర్యాదు అందింది. గురువారం పట్టపగలే ఓ క్యాషీయర్‌ను తుపాకీతో బెదిరించి దోచుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిసింది. అప్రమత్తమైన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందిగా ఏర్పడ్డారు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

వీరిలో ఇన్‌స్పెక్టర్‌తో సహా తొమ్మిది మంది బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కో బృందం ఒక్కో బైకుపై ఆపరేషన్‌లోకి దిగారు. ఆరో బృందం ఆటోలో బయలుదేరింది. ముందుగానే గుల్బర్గా గ్యాంగ్ దారి దోపిడీ స్కెచ్ పోలీసులకు తెలియడంతో గ్యాంగ్‌కు అనుమానం రాకుండానే వారి రూట్లో షాడోగా వెంబడించారు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

మధ్యాహ్నం ఒంటిగంటకు మాదాపూర్ బిగ్ సీ నుంచి బయలు దేరిన క్యాషీయర్ వెనుకాల గుల్బర్గా గ్యాంగ్ సభ్యులు ఫహీమ్ మిర్జా, అబ్లుల్ ఖదీర్ ఫాలో అయ్యారు. వీరి వెంట వెస్ట్ జోన్ ఇన్‌స్పెక్టర్ టీం షాడో చేసింది. ఇలా బృందాలు దుండగులను కవర్ చేస్తూ బైక్ పైలటింగ్ చేశారు. మాదాపూర్ నుంచి బయలుదేరిన వెంటనే రెండు బృందాలు జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 36 వద్ద ఉన్న సిగ్నల్ దాటి నీరూస్ వద్ద నిలబడ్డారు.

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ, సూత్రధారి మేనేజరే (ఫోటోలు)

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ, సూత్రధారి మేనేజరే (ఫోటోలు)

1.15 నిమిషాలకు గుల్బర్గా టీం సిగ్నల్ దాటి నీరూస్ ఫోరూం దాటుతుండగా వెనకాల నుంచి వచ్చిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ తన బైకుతో ముఠా వాహనాన్ని ఢీకొట్టారు. వెంటనే వారి పట్టుకునేందుకు ప్రయత్నించారు. బైకు వెనకాల కూర్చున్న ఫహీమ్ మిర్జా పోలీసులే వచ్చారని భావించి పరిగెత్తేందుకు యత్నించాడు. అక్కడే మాటు వేసిన మరో రెండు బృందాలు అతనిని పట్టుకున్నాయి.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

ఈ సందర్భంలో నెలకొన్న పెనుగాలటతో ఫహీమ్ దగ్గర ఉన్న తుపాకీ పేలి ఎల్‌అండ్‌టీ కార్మికుడు ధర్మేంద్ర సింగ్‌కు తూటా తగిలింది. నిందితులిద్దరితో పాటు సమీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయుధ గ్యాంగ్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సభ్యులకు అందరి నుంచి అభినందనలు వెల్లువిరుస్తున్నాయి.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

గుల్బర్గా గ్యాంగ్ బిగ్‌సి క్యాషీయర్‌ను మాదాపూర్ నుంచి ఫాలో అయ్యి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36 దాటిన తర్వాత దోపిడీ చేసుకుందామని ప్లాన్ వేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36 సిగ్నల్ దాటగానే క్యాషీయర్‌ను వెనకాల నుంచి వాహనంతో ఢీకొట్టి.. అతనిని రోడ్డు పక్కకు తీసుకెళ్లి తుపాకీలతో బెదిరించి క్యాష్‌ను ఎత్తుకెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. లేదంటే ఓ రౌండ్ రోడ్డుపై కాల్పులు జరిపి నగదును లాకెళ్లేందుకు ప్లాన్ వేశారు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

ఆ తర్వాత వాహనాన్ని పెద్దమ్మ గుడి వైపు నుంచి కేబీఆర్ పార్క్ వెనకాల వైపు నుంచి రోడ్డ్డు నెం.12 మీదుగా డౌన్ దిగి టోలీ చౌకీకి చేరుకునేందుకు దోపిడీ దొంగలు నిర్ణయించుకున్నారని పోలీసు విచారణలో తేలింది. క్యాషీయర్ దగ్గర దోచుకున్న నగదులో రూ. 2 లక్షలు బిగ్‌సీ సమీయుద్దీన్‌కు ఇచ్చే విధంగా వీరు ముందస్తుగా ఓ అంగీకారానికి వచ్చినట్లు దుండుగులు పోలీసులకు వెల్లడించారు. ఈ దోపిడీ సక్సెస్ అయితే నగరంలో మరికొన్ని డెకాయిటీలు పాల్పడేందుకు ఈ గ్యాంగ్ డిసైడ్ అయ్యిందని టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో స్పష్టమైంది.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

ఈ దోపిడీ కోసం వచ్చిన ఫహీమ్ మిర్జా, అబ్దుల్ ఖదీర్ కారు, బైక్‌ను గుల్బర్గా నుంచే తెచ్చుకున్నారు. ఆ వాహనాలకు ఇతర నెంబరు ప్లేట్లను వేశారు. వీరి వెంట వచ్చిన మరో వ్యక్తి బైకు దొరకపోవడంతో దోపిడీలో పాల్గొనలేకపోయాడని పోలీసులు వివరించారు. ఈ స్కెచ్ అంతా మాదాపూర్ బిగ్‌సీలో కస్టమర్ కేర్ ఇన్‌చార్జిగా ఉన్న సమియుద్దీన్ ప్రోద్భలంతోనే జరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టిన ఫహీమ్ మిర్జా బేగ్ తన విద్యాభ్యాసాన్ని గుల్బర్గాలోనే సాగించాడు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

రిటైర్డ్ రైల్వే సిగ్నల్ ఆఫీసర్ కుమారుడైన అతను ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివి ఆ తర్వాత నేరాలకు పాల్పడుతూ కరుడుఘట్టిన క్రిమినల్‌గా మారాడు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం అతనిపై ఆరు కేసులు, గుల్బర్గాలో 4 క్రిమినల్ కేసులు నమోదైయ్యాయని పోలీసులు చెప్పారు. ఫహీమ్ మిర్జా బేగ్, అబ్దుల్ ఖదీర్, సమీయుద్దీన్‌లను అరెస్టు చేసిన పోలీసులు రెండు తుపాకులు, 9 లైవ్ రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

గుల్బార్గా గ్యాంగ్‌ను పట్టుకోవడంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రదర్శించిన ధైర్య సాహసాలు అభినందనీయమని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జరిగిన జూబ్లీహిల్స్ కాల్పుల సంఘటనపై శుక్రవారం ఆయన కమిషనర్ కార్యాలయంలో మాట్లాడారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులుసాయుధ గ్యాంగ్‌ను పట్టుకున్న తీరు అందరీ అభిమానాలను పొందుతోందని సీపీ కితాబు ఇచ్చారు.

 'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

'బిగ్' ప్లాన్‌తోనే: మోటార్ సైకిల్‌పై రెక్కీ

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవా పతకాలు వచ్చే సిఫార్సు చేస్తామని చెబుతూ.. అందరీకి నగదు బహుమతులను అందించారు. బిగ్‌సీలో పని చేసే కస్టమర్ కేర్ ఇన్‌చార్జి సమీయుద్దీన్ ప్రోత్సాహంతోనే గుల్బర్గా గ్యాంగ్ రంగంలోకి దిగిందన్నారు. జైళ్ళో పరిచయమైన వ్యక్తి ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటు తుపాకులను తీసుకొచ్చారని విచారణలో తేలిందన్నారు.

English summary
Mahender Reddy Showing Pistol Recovered from Robbers at CP Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X