వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మురుదగాస్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి: చిరంజీవి దారిలో మహేష్ బాబు నో

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సినిమాలలో నటించిన తర్వాత ఒకరిద్దరు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా అంశంపై చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సినిమాలలో నటించిన తర్వాత ఒకరిద్దరు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా అంశంపై చర్చ సాగుతోంది.

రాజకీయాలతో సంబంధం లేదు, కానీ: నటుడు మహేష్ బాబురాజకీయాలతో సంబంధం లేదు, కానీ: నటుడు మహేష్ బాబు

మహేష్ బాబుకు పొలిటికల్ ప్రశ్నలు

మహేష్ బాబుకు పొలిటికల్ ప్రశ్నలు

సాధారణంగా మహేష్ బాబు రాజకీయాలకు దూరం. కానీ మీడియా ప్రతినిధులు మాత్రం ఆయనను రాజకీయ అంశాల గురించి అడుగుతున్నారు. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టిడిపి నేతగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అయినా కూడా గత ఎన్నికల్లో ఏ పార్టీకి మహేష్ బాబు మద్దతు ప్రకటించలేదు.

పార్టీ స్థాపించిన విజయకాంత్

పార్టీ స్థాపించిన విజయకాంత్

గతంలో మురుగదాస్ విజయకాంత్, చిరంజీవిలతో సినిమాలు తీశారు. తమిళ నటుడు విజయకాంత్‌తో రమణ సినిమా తీశారు. ఆ సినిమా తర్వాత విజయకాంత్ రాజకీయ పార్టీని స్థాపించారు.

చిరంజీవి కూడా

చిరంజీవి కూడా

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నటుడు చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్ర దర్శకులు మురుగదాస్. ఆ సినిమా అనంతరం చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో 18 సీట్లు దక్కించుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

మహేష్ బాబుకు ఎదురవుతున్న ప్రశ్న

మహేష్ బాబుకు ఎదురవుతున్న ప్రశ్న

ఇదే విషయమై మీడియా ప్రతినిధులు మహేష్ బాబును ప్రశ్నిస్తున్నారు. రమణ తర్వాత విజయకాంత్, స్టాలిన్ అనంతరం కొన్నాళ్లకు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని, మీరు కూడా వస్తారా అని మహేష్ బాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

నాకు ఆ ఉద్దేశ్యమే లేదు

నాకు ఆ ఉద్దేశ్యమే లేదు

అయితే, ఆయన దీనిపై సూటిగా సమాధానం చెబుతున్నారు. తనకు రాజకీయాలంటే స్పెల్లింగ్ కూడా తెలియదని అన్నారు. అలాంటి ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు.

English summary
Super Star Mahesh Babu talk about politics in an interview. He said that he is not interested in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X