హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామజ్యోతి: మహేష్ బాబుకి కేటీఆర్ ఫోన్, పాలమూరులో గ్రామాన్ని దత్తతకు సంసిద్ధత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘గ్రామజ్యోతి' పథకానికి దన్నుగా నిలిచేందుకు మహేష్ బాబు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయవంతం కావడంపై ఇప్పటికే ట్విట్టర్‌లో శుభాకాంక్షలు అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు.. బుధవారం మహేశ్‌బాబుకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.

శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక పల్లెను దత్తతకు తీసుకోవాలని కోరారు. దీనికి మహేష్ బాబు సానుకూలంగా స్పందించారు. అత్యంత వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని తెలిపాడు.

 Mahesh babu to adopt telangana village palamuru district

ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఈ ఆసక్తికర అంశాన్ని పోస్ట్ చేశారు. 'గ్రామజ్యోతి'లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరిన మీదటే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మహేష్ బాబు ప్రకటించారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని మహేష్ తెలిపారు.

శ్రీమంతుడు సినిమా విడుదలైన తర్వాత ట్విట్టర్‌లో మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, శ్రీమంతుడు స్ఫూర్తిదాయకమైన చిత్రమని పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం తీసుకువస్తున్న తరుణంలోనే ఈ సినిమా రావడం, ఈ సినిమాలోనూ గ్రామాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను సృజించడం ఎంతో బావుందని ట్వీట్ చేశారు.

దీనికి వెంటనే స్పందించిన మహేష్ థ్యాంక్యూ కేటీఆర్ సర్ అంటూ తిరిగి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Mahesh babu to adopt telangana village palamuru district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X