వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ బాబు కౌంటర్ : జీఎస్టీ కమిషనర్‌కు లీగల్ నోటీసులు పంపిన ప్రిన్స్

|
Google Oneindia TeluguNews

2007-08 సంవత్సరానికి ప్రిన్స్ మహేష్ బాబు సేవా పన్నులు కట్టలేదని చెబుతూ ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింప జేసింది హైదరాబాదు జీఎస్టీ కమిషనరేట్. దీనిపై తీవ్రంగా స్పందించారు ప్రిన్స్ మహేష్ బాబు. జీఎస్టీ కమిషనర్‌కు లీగల్ నోటీసులు పంపారు. తాను ఎలాంటి పన్నులు కట్టకుండా ఎగ్గొట్టలేదని తెలిపారు మహేష్ బాబు. తను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని చెప్పారు. పన్నులన్నీ సక్రమంగా కట్టినట్లు మహేష్ బాబు స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న తన బ్యాంకు అకౌంట్లను కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా స్తంభింపజేస్తారని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ పలు ఉత్పత్తులను ప్రమోట్ చేశారని ఆ సమయంలో ఆయన సేవా పన్నులు కట్టలేదంటూ పేర్కొంటూ హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ నోటీసులు పంపింది. దీనిపై వచ్చిన ఆదాయంపై మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరానికి పన్ను కట్టకుండా ఉన్న మొత్తం రూ. 18.5 లక్షలుగా జీఎస్టీ అధికారులు తేల్చారు.

Mahesh Babu sends legal notice to GST commissioner

మహేష్ బాబు 2007-08 సంవత్సరానికి మొత్తం రూ. 18.5 లక్షల సేవా పన్ను కట్టనందున గురువారం రోజున మహేష్ బాబుకు చెందిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా, యాక్సిస్ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేశారు. దీని విలువ మొత్తం రూ. 73.5 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఇందులో జరిమానా పన్నుపై వడ్డీ కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

English summary
Film actor Mahesh Babu replied strongly over Gst sending notices to him. He sent a legal notice to the GST commissioner saying that he had never evaded any tax and that he is a responsible citizen of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X