వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ ఓటర్లకు ‘శ్రీమంతుడి’ పిలుపు: జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపు సెలవు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నగర ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

అందమైన హైదరాబాద్ నగరాని కోసం తమ విలువైన ఓటును వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మహేష్ మీదున్న అభిమానంతో అనేక మంది ఆయన అభిమానులు గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిద్దాం.

హైద్రాబాద్ 'శ్రీమంతుడు' కెసిఆర్: బాబుకు టిఆర్ఎస్ ప్రశంస, 'స్మార్ట్ సిటీ' ఫైట్హైద్రాబాద్ 'శ్రీమంతుడు' కెసిఆర్: బాబుకు టిఆర్ఎస్ ప్రశంస, 'స్మార్ట్ సిటీ' ఫైట్

రేపు సెలవు

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం సెలవు దినం పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూడాలని 3 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఓటరు కార్డు తప్పనిసరి

ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటరు గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకొనిరావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఓటర్లకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇతర గుర్తింపుకార్డులు తీసుకొనిరావాలన్నారు.

ప్రతి వార్డుకు జోనల్‌ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చామని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు మొరాయిస్తే.. వాటి స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

English summary
Tollywood Super Star Mahesh Babu on Monday tweeted GHMC polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X