వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనమ్ కౌర్ ఎఫెక్టా... సారీ అడగట్లేదు: పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు మహేష్ కత్తి జవాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ తనకు క్షమాపణలు చెప్పాలని కోరుకోవడం లేదని మహేష్ కత్తి అన్నారు. జనసేనాని పేరుతో ఆయన మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. తనకు హైప్ కోసం పవన్‌ను ఆయన తిడుతున్నారనే

చదవండి: మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'తప్పు చేశా, అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడు'

ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ కత్తి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్‌ను తాను క్షమాపణలు చేరుకోవడం లేదని, ఫ్యాన్సును కట్టడి చేయాలని మాత్రమే అడుగుతున్నానని చెప్పారు. పవన్ ఓ పార్టీ నాయకుడు అని, తన అభిమానులకు ఓ మాట చెబితే సరిపోతుందన్నారు.

పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చెప్పాలి

పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చెప్పాలి

మహేష్ కత్తి జోలికి వెళ్లవద్దని పవన్ చెబితే వివాదం ముగిసిపోతుందని మహేష్ కత్తి అన్నారు. లేదంటే అభిమాననులు చేసిన దానికి తనకు సంబంధం లేదని చెప్పాలన్నారు. ఇంత జరుగుతున్న స్పందన లేదన్నారు. అమెరికాలోని ప్రేక్షకులకు మాత్రం కృతజ్ఞతలు చెబుతారన్నారు. ఈ వివాదంపై స్పందించరా అని ప్రశ్నించారు. 15 వరకు మౌనంగా ఉంటానని చెప్పానని, అలాగే ఉన్నానని చెప్పారు.

పూనమ్ కౌర్‌కు ప్రశ్నల ఎఫెక్టా

పూనమ్ కౌర్‌కు ప్రశ్నల ఎఫెక్టా

శతఘ్ని పేరుతో జనసేన పార్టీ వాళ్లు తమ ఫ్యామిలీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. ఈ రోజు వరకు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉండాలన్నారు. పెద్దమనిషి తరహాలో కోన వెంకట్ ఓ మాట అన్నారని, దానికి తాను కట్టుబడి ఉన్నానని, ఆ తర్వాత రోజు నుంచి సైలెంట్‌గా ఉన్నా వార్నింగ్ ఇస్తూ కొడతా.. కోటేశ్వర రావు అనే పాట రిలీజ్‌కు ప్రయత్నించారని చెప్పారు. కాగా, మహిళ అయిన పూనమ్ కౌర్‌కు మహేష్ కత్తి వేసిన ఆరు ప్రశ్నలు విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఆ అంశంపై తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత రావడంతో మహేష్ కత్తి కొంత తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే, మహేష్ కత్తి.. పవన్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. దీంతో కొందరు మహేష్ కత్తి ఫ్యామిలీ గురించి మాట్లాడటం ప్రారంభించారని అంటున్నారు. ఒక్క మహేష్ కత్తికే తనను తాను అదుపులో పెట్టుకోలేనప్పుడు, లక్షలాది మంది అభిమానులను ఎలా పెట్టగలరనేది చాలామంది ప్రశ్న. తొలుత మహేష్ కత్తి తగ్గాలని చాలామంది నుంచి వినిపించిన మాట. దీంతో ఇటీవల ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు.

 నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానని

నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానని

మరోవైపు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడిగిన ఏడు ప్రశ్నలకు మహేష్ కత్తి సమాధానం చెప్పారు. మొదటి ప్రశ్న.. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడనే ప్రశ్నకు... మహేష్ కత్తి స్పందిస్తూ.. ఆయ‌న రిటైర్మెంటుతో వ‌చ్చిన డ‌బ్బుల‌తో తమ ఊళ్లో.. తమకు ఉన్న స్థ‌లంలో చిన్న ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారని, కోట్లు ఉన్నాయ‌నేది ఫ్యాన్స్ ఊహించుకుని ఆరోపణ‌లు చేస్తున్నారని, తాను ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాన‌ని, హుందాగా క‌న‌ప‌డుతున్నాన‌ని ప‌వ‌న్‌ ఫ్యాన్స్ తమ తండ్రి వ‌ద్ద బాగా డ‌బ్బుంద‌ని అనుకుని, ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారన్నారు.

కుటుంబం గ్రామానికి రాకపోవడంపై

కుటుంబం గ్రామానికి రాకపోవడంపై

తమ కుటుంబం గ్రామానికి రావడం లేదని రెండో ప్రశ్న సంధించారని, కానీ తమ కుటుంబం గ్రామంలోనే ఉందని, తండ్రి అక్కడే ఇళ్లు కట్టుకొని ఉన్నారని చెప్పారు. మూడో ప్రశ్న.. బిగ్ బాస్ షోకు వైసీపీ నేత అంబటి రాంబాబు రికమెండ్ చేశారనే ప్రశ్నకు.. మహేష్ కత్తి స్పందించారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిని మూంబై బృందం వచ్చి సెలెక్ట్ చేసిందని, 80 మందిని ఇంటర్వ్యూ చేసి కొందరిని మాత్రమే ఎంపిక చేసిందని, వాళ్లు చేసిన ఎంపికకు అంబటి రాంబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

 తన వెనుక వైసీపీ ఉండటంపై

తన వెనుక వైసీపీ ఉండటంపై

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంత డబ్బు ఇచ్చిందనే 4వ ప్రశ్నకు మహేష్ కత్తి స్పందిస్తూ.. తన కోసం తాను పోరాడుతుంటే, తన ఆత్మ‌గౌర‌వం కోసం తాను ప్ర‌శ్నిస్తోంటే వైసీపీ నా వెనుక ఉందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారని, ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారని మండిపడ్డారు.

తల్లీ, చెల్లి గురించి మహేష్ కత్తి ఇలా

తల్లీ, చెల్లి గురించి మహేష్ కత్తి ఇలా

చిట్టీల పేరుతో గ్రామస్తులను నీ తల్లి మోసం చేసిందన్న ఐదో ప్రశ్నకు స్పందిస్తూ.. తన తల్లి ఎన్నడూ చిట్టీలు వేయలేదని, ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయిందన్నారు. నీ సోదరి భర్తను బెదిరించి డబ్బు లాగేందుకు ఎవరు సాయం చేశారనే మరో ప్రశ్నకు స్పందిస్తూ.. ఆయ‌న పేరు కృష్ణ భ‌గ‌వాన్‌ అని, ఆయ‌న త‌న ఉద్యోగాన్ని చేసుకుంటూ బ‌తుకుతుంటాడని, తన సోద‌రి జీవితం ఇప్పుడు సంతోషంగా ఉందని, తనను దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో తన కుటుంబంపై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారన్నారు.

సంక్రాంతికి ఊరెళ్ళా

సంక్రాంతికి ఊరెళ్ళా

నీ కుటుంబం ఎలాంటి తప్పు చేయకుంటే ప్రతి సంక్రాంతికి సొంత గ్రామానికి ఎందుకు రావడం లేదనే ఏడో ప్రశ్నకు మహేష్ కత్తి స్పందిస్తూ.. తాను సంక్రాంతికి తన ఊరికి వెళ్లానని, తన తండ్రి కూడా ఆ ఊరిలోనే ఉన్నారని, అప్పుడప్పుడు తాను ఊరికి వెళ్లి వస్తూనే ఉన్నానని చెప్పారు.

English summary
Kathi Mahesh gave answers to the seven questions asked by Jana Sena chief Pawan Kalyan fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X