వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును మించినోడా, పోటీకి సై: పవన్‌పై మహేష్ కత్తి, ఇదీ పవర్ స్టార్: కాదంబరి కిరణ్ చురక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: నారావారిపల్లె పర్యటనలో ప్రజలకు అంతరాయం కలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే క్షమాపణ చెప్పారని, ఆయనను మించిన వ్యక్తి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాదు కదా అని మహేష్ కత్తి అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడారు.

చదవండి: మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'తప్పు చేశా, అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడు'

పవన్ కళ్యాణ్‌ను నిత్యం విమర్శిస్తూ మీడియాలో నానుతూ, హైపా సాధించుకుంటున్నారని మహేష్ కత్తిపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఛానల్లో మాట్లాడారు. ఫ్యాన్స్ ఇంత చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక్క సారీ చెప్పవచ్చు కదా అని, ఆయనకు ఎందుకు అంత అని ప్రశ్నించారు.

చదవండి: పూనమ్ కౌర్ ఎఫెక్టా... సారీ అడగట్లేదు: పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు మహేష్ కత్తి జవాబు

చంద్రబాబు, మోడీ, జగన్ గురించి మాట్లాడొచ్చు కానీ

చంద్రబాబు, మోడీ, జగన్ గురించి మాట్లాడొచ్చు కానీ

నా ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశమని, అందుకే వివాదాన్ని విడిచి పెట్టడం లేదన్నారు. మనం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ల గురించి మాట్లాడవచ్చు కానీ, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే దాడి చేస్తారా అని మహేష్ కత్తి ప్రశ్నించారు. అయితే, పవన్‌ను పదేపదే టార్గెట్ చేయడమే కాకుండా, ఆయన వ్యక్తిగత విషయాన్ని మహేష్ కత్తి లాగారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పవన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇతరులు కూడా ఉన్నారు, వారినే అనకుండా అభిమానులు కేవలం మహేష్ కత్తినే ఎందుకు అంటున్నారనే విషయం తెలుసుకోవాలని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ అతీతుడా

పవన్ కళ్యాణ్ అతీతుడా

మహేష్ కత్తి ఇంకా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విమర్శలకు అతీతుడా అని ప్రశ్నించారు. పవన్ గురించి వ్యక్తిగతంగా అభిప్రాయం చెబితే ఈ స్థాయి దాడి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇది తన ఒక్కడి సమస్య కాదన్నారు. తన కోసం అందరూ నిలబడాలన్నారు. పవన్ అన్నింటికి అతీతుడు అని అభిమానులు అనుకుంటున్నారని, దానిని డిస్ ప్రూవ్ చేయాలన్నారు. లేదంటే మనం ప్రజాస్వామ్యంలో లేనట్లే అన్నారు. అరాచకాన్ని అడ్డుకోవడానికే ఉన్నా అన్నారు. అయితే పవన్ వ్యక్తిగత విషయాలు, పూనమ్ కౌర్‌ను లాగడం మహేష్ కత్తికి ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం

పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం

తాను పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ కత్తి అన్నారు. అది ఎన్నికల బరిలో అయినా, క్రిటిక్ రైటర్ అయినా సరే అన్నారు. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టే పంథా ఉన్న వ్యక్తి పవన్ అని, ఆయన ప్రజాస్వామ్యానికి పనికి రాడు అన్నారు.

అసలు విషయం బయటపెట్టిన మహేష్ కత్తి

అసలు విషయం బయటపెట్టిన మహేష్ కత్తి

నేను సామాన్యుడిని అని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు ఉందని, నాలుగు నెలల క్షోభలో తనకు అనిపించింది ఏమిటంటే, నా హక్కులు, వ్యక్తిత్వం, అస్తిత్వం కోసం పోరాడుతుంటే వీళ్లకు ఎందుకు అర్థం కావడం లేదని, ఒక బానిస మెంటాలిటీలో బతికేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు. కాగా, ఇన్నాళ్లు పవన్‌ను విమర్శించడం ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తిగా కూడా మలుచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మహేష్ కత్తికి కాదంబరి కిరణ్ ఇలా

మహేష్ కత్తికి కాదంబరి కిరణ్ ఇలా

మహేష్ కత్తి - సినీ నటుడు కాదంబరి కిరణ్‌ల మధ్య కూడా సంభాషణ జరిగింది. పవన్ వచ్చి ఫ్యాన్సుకు చెప్పాలి కదా అని, తన గురించి ఎందుకు స్పందించడం లేదని మహేష్ కత్తి ప్రశ్నించారు. పవన్ మాత్రమే దీనిని కంట్రోల్ చేయగలరని చెప్పారు.

మీ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగవద్దని, ఆయన వచ్చి మాట్లాడాలని అడగవద్దని కాదంబరి కిరణ్.. మహేష్ కత్తికి సూచించారు. ఇలాంటి వివాదాలను పవన్ ప్రోత్సహించరని, ఆయన అహింసావాది అని, కేన్సర్ పేషెంట్‌ను చూస్తే కళ్ల వెంట నీళ్లు వచ్చే వ్యక్తిత్వం ఆయనది అని కాదంబరి కిరణ్ అన్నారు. మహేష్ కత్తి స్వయంగా పవన్‌ను కలవొచ్చు అని, సలహాలు ఇవ్వవచ్చు అని, లేదంటే మేమే ట్వీట్ పెట్టమని కోరుతామని కాదంబరి కిరణ్ అన్నారు.

English summary
Mahesh Kathi said that he is ready to contest in next elections on Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X