వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్, పవన్ కళ్యాణే నా కాళ్ల వద్దకు రావాల్సి ఉంటుంది: మహేష్ కత్తి, అభిమాని దిమ్మతిరిగే షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ కత్తి అభిమానుల మధ్య వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మహేష్ కత్తి, పవన్ అభిమాని రాజారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పదేపదే పవన్‌ను టార్గెట్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చదవండి: పూనమ్ కౌర్ ఎఫెక్టా... సారీ అడగట్లేదు: పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు మహేష్ కత్తి జవాబు

పవన్ కళ్యాణ్ స్పందించే వరకు తాను తగ్గేది లేదని గతంలో మహేష్ కత్తి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15వ తేదీ వరకు మౌనంగా ఉంటానని చెప్పారు. తాజాగా టీవీ ఇంటర్వ్యూలో రాజారెడ్డి అనే అభిమాని మాట్లాడుతూ.. పదేపదే పవన్‌ను టార్గెట్ చేస్తూ, ఆయన వ్యక్తిగత విషయాలు తొలుత తీసిన మహేష్ కత్తి.. పవన్ కాళ్లకు మొక్కి సారీ చెప్పాలన్నారు.

చదవండి: మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'తప్పు చేశా, అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడు'

పవన్‌వ్యక్తిగత విషయాలు, పూనమ్ ఇష్యూ.. అభిమాని రాజిరెడ్డి ఘాటుగా

పవన్‌వ్యక్తిగత విషయాలు, పూనమ్ ఇష్యూ.. అభిమాని రాజిరెడ్డి ఘాటుగా

గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను లాగి మహేష్ కత్తి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. మూడో పెళ్లి, నాలుగో పెళ్లి అనడమే కాకుండా నటి పూనమ్ కౌర్‌కు కూడా వివాదాస్పదరీతిలో ప్రశ్నలు సంధించారు. వీటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజిరెడ్డి అనే అభిమాని ఘాటుగా స్పందించారు. ఈ క్షణం గొడవ ఆపాలనుకుంటే పవన్ కాళ్లకు దండం పెట్టుకొని స్టూడియో నుంచి వెళ్లిపో అన్నారు.

 7 ప్రశ్నలకు సమాధానం సరే, పవన్‌పై ఏ ఆధారాలతో

7 ప్రశ్నలకు సమాధానం సరే, పవన్‌పై ఏ ఆధారాలతో

మహేష్ కత్తి చెప్పిన ఏడు సమాధానాలపై కూడా రాజిరెడ్డి స్పందించారు. ఆయన సమాధానాలు దొంగని పోలీసులు పట్టుకెళ్తే పోలీసులకు దొంగ రకరకాల కథలు చెబుతాడని, అలాంటి కథనే మహేష్ కత్తి చెప్పారన్నారు. ఏ ఆధారాలు ఉన్నాయని పవన్‌పై ఇన్ని ఆరోపణలు చేశాడో చెప్పాలని నిలదీశారు.

పవన్ కళ్యాణ్ అడిగితే చెబుతా

పవన్ కళ్యాణ్ అడిగితే చెబుతా

దీనిపై మహేష్ కత్తి స్పందిస్తూ.. ఈ విషయం పవన్ కళ్యాణ్ అడిగితే చెప్పడానికి తాను సిద్ధమని, ఆధారాలు చూపిస్తానని చెప్పారు. మహేష్ కత్తి ఫ్యామిలీ ఏమిటో కనుక్కొని మాట్లాడాలన్నారు. తాను వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నానని, మీరు ఇలాగే మాట్లాడితే పవన్‌కు కౌంటర్లు వేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా, పవన్‌పై ఆధారాలు నిజమే అయితే బయటపెట్టవచ్చు కదా అని, లేదంటే సారీ చెప్పవచ్చు కదా అనేది పలువురు ప్రశ్న.

మెట్టుదిగానని మహేష్ కత్తి

మెట్టుదిగానని మహేష్ కత్తి

పవన్ కళ్యాణ్ విషయంలో తాను ఇప్పటికే ఓ మెట్టు దిగానని మహేష్ కత్తి అన్నారు. మొదట పవన్ వచ్చి క్షమాపణలు చెప్పానని అడిగానని, ఆ తర్వాత ట్వీట్ చేస్తే చాలని చెప్పానని గుర్తు చేశారు. తాను ఎప్పుడూ పవన్‌ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో తన భావాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే హక్కు లేదా అన్నారు. కాగా, పవన్ లాంటి వ్యక్తి ప్రమేయం లేకుండానే, ఆయనను మొదట లాగిన మహేష్ కత్తి ఆ తర్వాత క్షమాపణలు చెప్పమనడం ఏమిటనేది అభిమానుల ప్రశ్న. అలాగే, పవన్ పెళ్లిళ్ల గురించి, పూనమ్ కౌర్ గురించి మాట్లాడటం వ్యక్తిగతం కాదా అనేది అందరి ప్రశ్న.

హక్కులు కాలరాసేలా, జనసేన నాశనం అవుతుంది

హక్కులు కాలరాసేలా, జనసేన నాశనం అవుతుంది

తన హక్కును కాలరాసేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. తన ప్రతి కదలిక మీదే కాకుండా, తన కుటుంబ సభ్యులపై కూడా కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. పైగా ఈ వివాదం ఆగాలంటే తననే ఓ మెట్టు దిగాలని నీతులు చెబుతున్నారని అన్నారు. ఇలాంటి అభిమానలు ఉంటే జనసేన నాశనం అవుతుందన్నారు. కాగా, పవన్‌ను తిడుతూ హైప్ సాధించే ప్రయత్నాలు చేయడమే కాకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగింది మహేష్ కత్తి అని అభిమానులు అంటున్నారు. మెట్టు దిగానని ఆయన చెప్పింది నిజమే అయితే మౌనంగా ఉండకుండా మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

 కావాలనే ముగింపు పలకడం లేదా

కావాలనే ముగింపు పలకడం లేదా

హేష్ కత్తి ఇంకా మాట్లాడుతూ.. వివాదానికి తెరదించాలని తాను చర్చకు వస్తే కామెంట్లు చేస్తున్నారని, పవన్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని లేదంటే గొడవ ఆగదని అంటున్నారని మహేష్ కత్తి అన్నారు. అయితే, గొడవ ఆపాలని మహేష్ కత్తికి ఉంటే ఇప్పుడు స్టూడియోకు వచ్చి ఉండేవారు కాదని, మళ్లీ రెచ్చగొట్టేందుకే వచ్చారని, మరో నాలుగు రోజులు మౌనంగా ఉంటే వివాదం ముగిసేదని, కానీ ఆయన కావాలనే పవన్ పేరుతో హైప్ తెచ్చుకుంటూ, ఉద్దేశ్యపూర్వకంగా ఈ వివాదానికి ముగింపు పలకడం లేదని అంటున్నారు.

పవన్ కళ్యాణే నా కాళ్ల వద్దకు రావాల్సి ఉంటుంది

పవన్ కళ్యాణే నా కాళ్ల వద్దకు రావాల్సి ఉంటుంది

తనను పవన్ కళ్యాణ్ అభిమానులు బెదిరిస్తున్నారా అని మహేష్ కత్తి ప్రశ్నించారు. నేనే కనుక రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేస్తే తన వైపు ప్రజా సంఘాలు, ఇతర సంఘాలు ఉంటాయని హెచ్చరించారు. అప్పుడు పవన్ కళ్యాణే తన కాళ్ల వద్దకు రావాల్సి ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, మహేష్ కత్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే లక్షలాది మంది అభిమానులు ఎలా ఊరుకుంటారనేది మరికొందరి ప్రశ్న.

English summary
Mahesh Kathi warning to Jana Sena chief Pawan Kalyan fans on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X