వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీపీల్లోనూ టీఆర్ఎస్ హవా : కొన్ని జిల్లాల్లో మెజార్టీ పీఠాలు కైవసం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన అధికార టీఆర్ఎస్ పార్టీ .. ఎంపీపీలను సైతం కైవసం చేసుకుంది. మెజార్టీ మండల పరిషత్ కార్యాలయాల్లో గులాబీ జెండా ఎగరవేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

majority mpps won by trs

కరీంనగర్‌లో హవా ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ టీఆర్ఎస్ మెజార్టీ ఎంపీసీ స్థానాలను దక్కించుకుంది. ఇటు ఓరుగల్లులోనూ గులాబీ హవా కొనసాగింది. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ 10 ఎంపీసీ స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, స్వంత్రత్య అభ్యర్థి ఒక్కో స్థానాన్ని దక్కింంచుకున్నాయి. గుడిహత్నూరు, మావల స్థానాల్లో ఎన్నిక వాయిదా పడింది. కొమ్రంభీం ఆసిఫిబాబాద్ జిల్లాల్లో వేరే పార్టీలకు అవకాశం లేకుండా 15 ఎంపీపీ పదవులను టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి .. పాగా వేశారు.

నిర్మల్‌ .. ఇందూరులో సత్తా
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 ఎంపీసీ స్థానాలు ఉన్నాయి. 12 చోట్ల టీఆర్ఎస్, ఐదుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధికారం చేపట్టారు. ఒకచోట స్వతంత్ర్య అభ్యర్ధి విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 16 స్థానాల్లో 14 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. భీమిని ఎంపిక కూడా వాయిదా పడింది. నిజామాబాద్ జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది. 27 ఎంపీపీ స్థానాలకు గాను 24 చోట్ల విజయం సాధించింది. రెంజల్ ఎంపీసీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. బోధన్, చందూరులో ఎన్నిక వాయిదా పడింది. కానీ ఇందూరులో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన శ్రీనివాస్ చివరలో అదృష్టం కలిసొచ్చింది. ఎడపల్లి ఎంపీపీగా విజయం సాధించారు.

English summary
TRS party in the local bodies election has also bagged MPPs. trs won Mandal Parishad offices. TRS candidates in the Adilabad and Nizamabad districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X