వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

32 జెడ్పీలు, 530 ఎంపీటీసీలు మావే : స్థానిక సంస్థల్లో విజయంపై కేటీఆర్ ధీమా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్ విజయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన .. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మెజార్టీ లోక్‌సభ సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. ఇక స్థానిక సంస్థల్లో కూడా గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో పాగా వేస్తామని ధీమాతో ఉంది. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.

majority zps, mptc won trs : ktr

కలిసి పనిచేయండి
స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యుహంతోపాటు .. లోక్ సభ పోలింగ్ సరళి గురించి కేటీఆర్ చర్చించారు. ఎల్లుండి జరిగే టీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశం గురించి కూడా సమావేశంలో ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని జెడ్పీల్లో గెలువడమే లక్ష్యంగా పనిచేయాలని జనరల్ సెక్రటరీలకు కేటీఆర్ స్పష్టంచేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. 32 జెడ్పీలతోపాటు 530 ఎంపీటీసీ స్థానాలు కూడా గెలుస్తామని ధీమాతో ఉన్నారు కేటీఆర్.

కాంగ్రెస్‌కు అంత లేదు
వివిధ ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు కేటీఆర్. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మారథం పట్టారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అందరి కలుపుకొని పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ .. సోమవారం జరిగే పార్టీ విసృతస్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

English summary
Ktr discussed the Lok Sabha polling pattern along with the purpose of local organizations. Ktr clarified that General Secretaries should work to win in the zp‘s in the state. ZPTC and MPTC have said that they should work to win the election. With 32 ZP, 530 MPTC seats are also in favor of Ktr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X