వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ డ్యూటీలు అక్కడ చెయ్యండి .. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ .. కేస్ ఫైల్

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తిట్టి పోలీసుల మీద చెయ్యెత్తాడు . ఇక తాజాగా ఎంఐఎం కార్పొరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు పోలీసులపై రెచ్చిపోయారు. మాదన్నపేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో బందోబస్తు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడ్డారు. మసీదు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం .. ఏపీ,మహారాష్ట్రలకు వెళ్ళకుండా నిషేధంతెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం .. ఏపీ,మహారాష్ట్రలకు వెళ్ళకుండా నిషేధం

హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అని మతం రంగు పులుముతూ కానిస్టేబుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ పోలీసు సిబ్బందిపై విరుచుకుపడ్డారు మూర్తుజా అలీ . ఇది వైరల్ కావటంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. ఇక ఆ ఎంఐఎం కార్పోరేట్‌, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై కార్పొరేటర్ వాదన మరోలా ఉంది. మసీదుకు తాళం వేయాలంటూ వారు బెదిరించారని చెప్తున్నారు .

Make your duties there .. MIM Corporator warning to police .. Case file

ఇక తాము మసీదుకు తాళం వెయ్యాల్సిందిగా వచ్చిన పర్మిషన్ లెటర్ చూపించమన్నానని తెలిపారు. దాన్ని చూపించకుండా ప్రజలను బెదరించారని అందుకే కోప్పడ్డానని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఇక ముర్తుజా అలీకి సంబంధించిన పోలీసులను బెదిరించే వీడియో పోస్ట్ చేసి ఇక ఈ వ్యక్తిపై తెలంగాణా డీజీపీ ఏదైనా చర్య తీసుకుంటారని మనం ఆశించవచ్చా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ . ఇలాంటి ఘటనలు జరుగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని తన భావన ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.

English summary
Murthuja Ali threw a challenge to police staff saying that they should go to Hindu temples and make objections to religion and make inappropriate comments on constables and you will be suspended. The matter went up to the police chiefs as it went viral. The police registered a case against the MIM corporate and his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X