వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ఎంపీ మల్లారెడ్డి: చర్లపల్లి జైలులో శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు, రాజీ కుదిరేనా?

భర్త ఇంటి ఎదుట కూతురుతో కలిసి దీక్ష చేస్తున్న సంగీతకు న్యాయం చేసేందుకు మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి రంగంలోకి దిగారు.సంగీత డిమాండ్లపై ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డితో చర్లపల్లి జైలులో మల్లారెడ్డి శుక్రవార

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భర్త ఇంటి ఎదుట కూతురుతో కలిసి దీక్ష చేస్తున్న సంగీతకు న్యాయం చేసేందుకు మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి రంగంలోకి దిగారు.సంగీత డిమాండ్లపై ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డితో చర్లపల్లి జైలులో మల్లారెడ్డి శుక్రవారం నాడు చర్చించారు. సంగీత డిమాండ్లకు శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారని ఎంపీ మల్లారెడ్డి చెప్పారు.సంగీతతో చర్చించి దీక్షను విరమిస్తానని మల్లారెడ్డి చెప్పారు.

తనకు న్యాయం చేయాలని కోరుతూ సంగీత ఆరు రోజులుగా అత్తింటి వారి ఎదుటే దీక్ష చేస్తున్నారు. సంగీతకు మద్దతుగా పలు రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు నిలిచాయి.

సంగీత దీక్ష కారణంగా టిఆర్ఎస్‌ నుండి శ్రీనివాస్ రెడ్డిని తప్పించారు. అంతేకాదు శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగీత దీక్షకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ సమస్యకు త్వరగా ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి రంగంలోకి దిగారు.

 చర్లపల్లి జైలులో శ్రీనివాస్ రెడ్డితో చర్చలు

చర్లపల్లి జైలులో శ్రీనివాస్ రెడ్డితో చర్చలు


టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత శ్రీనివాస్‌రెడ్డితో సంగీత డిమాండ్లపై చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి చర్చలు జరిపారు. సంగీత డిమాండ్లకు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారని ఆయన తెలిపారు. సంగీతతో మాట్లాడి.. ఆమె దీక్షను విరమింపచేస్తానని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

చర్లపల్లి జైలులో రాజీ చర్చలు

చర్లపల్లి జైలులో రాజీ చర్చలు

సంగీత డిమాండ్ల విషయమై ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డితో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి చర్చలు జరిపారు. ఈ ఆందోళన కొనసాగితే ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.దీంతో ఈ సమస్యకు పుల్ స్టాఫ్ పెట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్ రెడ్డితో మల్లారెడ్డి చర్చించారు. సంగీత డిమాండ్లు ఏమిటనే విషయాలను ఆయన శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. ఇరు వర్గాల మధ్య రాజీ మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారని సమాచారం.

సంగీత మామ బాల్‌రెడ్డితో చర్చలు

సంగీత మామ బాల్‌రెడ్డితో చర్చలు

ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. సంగీత కోరుతున్న ష‌రతుల‌కు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విర‌వింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. ఇప్పటికే బాల్‌రెడ్డిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు సంగీత డిమాండ్లకు ఒప్పుకొంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

పోరాటం కొనసాగిస్తున్న సంగీత

పోరాటం కొనసాగిస్తున్న సంగీత

శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత ఆరు రోజులుగా దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అయితే ఎంపీ మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో ఏం చర్చించారనే విషయాలు తెలియరాలేదు. ఈ దీక్షతో శ్రీనివాస్ రెడ్డికి సంగీత తగిన బుద్ది చెప్పిందని మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మహిళను ఇబ్బందిపెట్టేవారికి ఈ తరహ ఘటనలు గుణపాఠం చెప్పనున్నాయని అంటున్నారు.

English summary
Malkajgiri MP Malla Reddy discussed with srinivas reddy in cherlapally jail on Sangeeta demands.Mp Malla Reddy planning to resolve Sangeeta issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X