వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాకా’కు నివాళి: ఆపద్బాంధవుడన్న ఖర్గే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి (కాకా) దళితుల ఆపద్బాంధవుడని, గొప్ప రాజకీయ నేతని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దళితులకు తీరని లోటని చెప్పారు. వెంకటస్వామి దశదినకర్మ సందర్భంగా సికింద్రాబాద్ రాజేశ్వరి గార్డెన్‌లో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఖర్గేతోపాటు ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతికి శ్రమించిన నేత వెంకటస్వామి అన్నారు. రాష్ర్టానికి, దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు మరువలేనివన్నారు. వెంకటస్వామి కార్మికుల నేతగా అందరికీ సుపరిచితులని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు.

రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డాక్టర్ కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, జానారెడ్డి, డీ శ్రీనివాస్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. కాకా కుమారులు వినోద్, వివేక్, అల్లుడు శంకర్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాకాకు నేతల నివాళి

కాకాకు నేతల నివాళి

కాకా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి.

కాకాకు నివాళి

కాకాకు నివాళి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి (కాకా) దళితుల ఆపద్బాంధవుడని, గొప్ప రాజకీయ నేతని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.

కాకాకు నివాళి

కాకాకు నివాళి

ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దళితులకు తీరని లోటని చెప్పారు. వెంకటస్వామి దశదినకర్మ సందర్భంగా సికింద్రాబాద్ రాజేశ్వరి గార్డెన్‌లో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఖర్గేతోపాటు ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా పాల్గొని నివాళులర్పించారు.

కాకా కుమారుడు వివేక్‌తో..

కాకా కుమారుడు వివేక్‌తో..

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతికి శ్రమించిన నేత వెంకటస్వామి అన్నారు.

కాకాకు నివాళి

కాకాకు నివాళి

కాకాకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మెట్రో ఇండియా సంపాదకులు సిఎల్ రాజం.

English summary
Congress senior leaders Mallikarjun Kharge and Ramachandra Khuntia on Wednesday paid tributes to Kaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X