వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ఈ దళిత నేత...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఎన్నికల సమరం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఇక సోమవారం అభ్యర్థుల నామినేషన్ దాఖలకు చివరితేదీ. ఇప్పటికే అభ్యర్థులు అంతా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక సోమవారం నుంచి గులాబీ పార్టీ అధినేత సీఎం అభ్యర్థి కేసీఆర్ ప్రచారం హోరెత్తించనున్నారు. ఈ క్రమంలోనే కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజా కూటమి సీఎం అభ్యర్థి దళిత నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.

సీఎం అభ్యర్థిపై జరుగుతున్న చర్చ

సీఎం అభ్యర్థిపై జరుగుతున్న చర్చ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారంతో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినేతలు ప్రచారం ఊపందుకుంది. అయితే గులాబీ పార్టీ సీఎం అభ్యర్థిగా కేసీఆర్ అని అందరికీ తెలిసిందే. ఇక ఎటొచ్చి ప్రజా కూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ప్రజా కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా ఎవరుంటారు అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థి పేరు ముందే ప్రకటిస్తే బాగుంటుందని కొందరి ఆలోచనగా ఉంటుండగా మరికొందరు మాత్రం సీఎం అభ్యర్థి పేరు ముందే ప్రకటిస్తే గ్రూపులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దళిత అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని కాంగ్రెస్ యోచన

దళిత అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని కాంగ్రెస్ యోచన


ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రజాకూటమి నుంచి దళిత అభ్యర్థి పేరు ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే మధిర నియోజకవర్గం నుంచి బరిలో నిల్చున్న మల్లు భట్టివిక్రమార్క పేరును ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ కూటమి అధికారంలోకి వస్తే దళిత అభ్యర్థిని సీఎంగా చేసి కాంగ్రెస్ తన క్రెడిబులిటీని నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇది కూడా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే అవకాశం ఉంది.

 కాంగ్రెస్ దృష్టిలో మల్లు భట్టి విక్రమార్క పేరు..?

కాంగ్రెస్ దృష్టిలో మల్లు భట్టి విక్రమార్క పేరు..?


ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా దళిత నేత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అభ్యర్థిగా ఉంటారని ఢిల్లీలో జోరుగా వార్త ప్రచారంలో ఉంది. భట్టి విక్రమార్క కూడా ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ముందుకెళుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో భట్టివిక్రమార్క కాంగ్రెస్ అధిష్టానంకు దగ్గరవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాయిస్‌కూడా బలంగా వినిపిస్తున్నారు. దళిత నేతల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్శింహల్లాంటి నేతలున్నప్పటికీ అధిష్టానం మాత్రం భట్టి విక్రమార్క వైపే చూస్తోందని సమాచారం.

తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తే ఏపీలో ఆ ప్రభావం

తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తే ఏపీలో ఆ ప్రభావం


సాంప్రదాయ పరంగా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉంటూ వచ్చారు. అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవులు చేపట్టాక కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని సీఎం చేయడం ద్వారా 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ దళిత అభ్యర్థిని సీఎంగా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీలో దళిత ఓటు బ్యాంకు వైసీపీ వైపు ఉంది. ఈ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎలాగూ కాంగ్రెస్‌కే ఉండగా... ఇక పూర్తి స్థాయిలో దళితులను తమవైపు తిప్పుకుంటే ఇక్కడ బలపడొచ్చనే భావనతో కాంగ్రెస్ ఉంది.

Recommended Video

Telangana Elections 2018 : వ‌రంగ‌ల్ వెస్ట్ టిడిపి అభ్యర్ది గా రేవూరి ప్ర‌కాష్ రెడ్డి ప్రమాణ స్వీకారం

English summary
With the elction heat in Telangana on a rise, debates and discussions are taking place as who will be the cm face from congress led Praja kutami. Sources say that Congress high command will be playing the Dalit card. Congress working president a dalit leader Mallu Batti vikramarka's name is making rounds for the top post from congress in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X