• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు -కేసీఆర్ డీఎన్ఏ టీడీపీ, సీబీఐ ఉచ్చు: మల్లు ఫైర్ -నాగమన్న ఆశీస్సులు చాలు

|

ఆ మధ్య దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల్లో బీజేపీ హవా తర్వాత చాలా కాలానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఏబీవీపీ ద్వారా పొలిటికల్ కెరీర్ ఆరంభించి, టీడీపీలో ఓ వెలుగువెలిగి, ఇప్పుడు కాంగ్రెస్ లో సెటిలైన రేవంత్ రెడ్డికి ఉన్నత పదవి దక్కడంపై సొంత నేతలే భగ్గుమంటున్నారు. ప్రత్యర్థులైతే ఏకంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబే ఉన్నట్లు, గాంధీ భవన్ కాస్తా ఎన్టీఆర్ భవన్ లా మారిపోనుందని విమర్శలూ చేశారు. ఆ విమర్శకులతోపాటు టీఆర్ఎస్ కు కూడా ఘాటు కౌంటరిచ్చారు కాంగ్రెస్ నేత మల్లు రవి. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ తొలిసారి నాగం జనార్థన్ రెడ్డిని కలిశారు. వివరాలివి..

షాకింగ్: తెలంగాణలో కరోనాకు 1.5లక్షల మంది బలి -కేసీఆర్ లెక్క అబద్ధం: కాంగ్రెస్ -కొత్తగా 869 కేసులు, 8మరణాలుషాకింగ్: తెలంగాణలో కరోనాకు 1.5లక్షల మంది బలి -కేసీఆర్ లెక్క అబద్ధం: కాంగ్రెస్ -కొత్తగా 869 కేసులు, 8మరణాలు

రేవంత్ వ్యతిరేకుల దిమ్మతిరిగేలా

రేవంత్ వ్యతిరేకుల దిమ్మతిరిగేలా

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకే చెందిన పలువురు ముఖ్యనేతలు బాహాటంగా విమర్శలు చేయడం, ఇదే అదనుగా అధికార టీఆర్ఎస్ సైతం రేవంత్ ను టార్గెట్ చేసిన దరిమిలా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ మూలాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నవారిపై మల్లు ఓ రేంజ్ లో ఫైరయ్యారు. కేసీఆర్ రాజకీయ మూలాలను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రుల‌కు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేకులకూ కౌంటరిచ్చారు..

జగన్ పార్టీ మాజీ చీఫ్ బీజేపీలో చేరిక -షర్మిలకు షాకిచ్చిన గట్టు శ్రీకాంత్ రెడ్డి-కేసీఆర్ శీర్షాసనమంటూ బండి ఫైర్జగన్ పార్టీ మాజీ చీఫ్ బీజేపీలో చేరిక -షర్మిలకు షాకిచ్చిన గట్టు శ్రీకాంత్ రెడ్డి-కేసీఆర్ శీర్షాసనమంటూ బండి ఫైర్

కేసీఆర్ డీఎన్ఏలోనే టీడీపీ

కేసీఆర్ డీఎన్ఏలోనే టీడీపీ

‘‘ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అరంగేట్రం టీడీపీ ద్వారానే అయిందన్న సంగతి మర్చిపోతున్నారేమో అర్థం కావడంలేదు. టీడీపీ నేతగా ఎదిగిన తర్వాతే కేసీఆర్ టీఆర్ఎస్ కు అధ్యక్షుడయిండు. రేవంత్‌ రెడ్డిని విమ‌ర్శిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూడా టీడీపీ నీడ నుంచి వ‌చ్చినవాడే. రేవంత్ పై కేసులు ఉన్నాయని అంటున్నారే, మరి కేసీఆర్ పైన సీబీఐ కేసులు లేవా?'' అని రేవంత్ ప్రత్యర్థులపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు,

నాగమన్న ఆశీస్సులు చాలు..

నాగమన్న ఆశీస్సులు చాలు..

టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని కలుసుకున్నారు. పదవి చేపట్టిన తర్వాత పార్టీలో పనిచేసిన సీనియర్లందరినీ కలుస్తోన్న రేవంత్.. ఇప్పటికే జానారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ లాంటి సీనియర్లను కలిశారు. గురువారం నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారు. నాగం, ఆయన తనయుడు శశిధర్ రెడ్డిలు రేవంత్ కు శాలువా, పూల బొకేతో సన్మానం చేయగా, ‘ఈ ఫార్మాలిటీలేవీ అవసరం లేదు. నాకు నాగమన్న ఆశీర్వాదాలుంటే చాలు''అని రేవంత్ వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ గా కార్యకర్తల మనసు గెలుచుకోవాలని, తెలంగాణలో కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడలని రేవంత్ కు నాగం సూచించారు.

English summary
telangana congress senior leader mallu ravi made serious remarks on opposers of revanth reddy, who questions his tdp background. speaking to media on thursday, mallu ravi said cm kcr also had tdp history. meanwhile, new tpcc chief revanth reddy meets former minister nagam janardhan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X