హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహితపై కన్ను: ముగిసిన మాల్యాద్రి కస్టడీ, బోగస్ లెటర్లు స్వాధీనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి భార్య, భర్తల మధ్య విభేధాలు సృష్టించాడు. భార్యపై భర్తకు అనుమానం వచ్చేలా ప్రవర్తించాడు. ఈ మేరకు నకిలీ లేకలను సృష్టించాడు. తమ మధ్య అడ్డుగా ఉన్నాడని భావించిన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు మాల్యాద్రిని అరెస్ట్ చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టైన మాల్యాద్రిని పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ జరిపారు. కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో అతడిని పోలీసులు జైలుకు తరలించారు.

వివాహితపై కన్ను: భర్త హత్యకు సుపారీ, స్లో పాయిజన్, నిందితుడు పోలీసులకు చిక్కాడిలా వివాహితపై కన్ను: భర్త హత్యకు సుపారీ, స్లో పాయిజన్, నిందితుడు పోలీసులకు చిక్కాడిలా

హైద్రాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉండే ఓ దంపతుల మధ్య నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే మాల్యాద్రి అనే వ్యక్తి చిచ్చుపెట్టాడు. వివాహితపై కన్నేసిన మాల్యాద్రి ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా భర్తను చంపేందుకు కుట్ర కూడ పన్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో అరెస్టైన మాల్యాద్రిని మరింత సమాచారం కోసం పోలీసులు తమ కస్టడీకి తీసుకొన్నారు. ఈ కస్టడీ ముగిసింది. ఈ కస్టడీలో పోలీసులకు నిందితుడు మరింత సమాచారాన్ని ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

 వివాహితపై కన్నేసి భర్తను చంపేందుకు కుట్ర

వివాహితపై కన్నేసి భర్తను చంపేందుకు కుట్ర

బంజారాహిల్స్ లో నివాసం ఉండే దంపతుల మధ్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే మాల్యాద్రి అనే వ్యక్తి చిచ్చు పెట్టాడు. అంబులెన్స్ కోసం ఫోన్ చేసిన ఆ వివాహితకు సహయం చేస్తామని ఆ కుటుంబానికి దగ్గరై ఆ కుటుంబంలోనే మాల్యాద్రి చిచ్చుపెట్టాడని పోలీసులు తెలిపారు. వివాహిత భర్తను హత్య చేసేందుకు కూడ ప్లాన్ చేశాడని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. వివాహితకు భర్తకు స్లో పాయిజన్ ఇవ్వడమే కాకుండా అతడిని హత్య చేసేందుకు కూడ సుపారీ ఇచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

బోగస్ అపాయింట్ మెట్ లెటర్

బోగస్ అపాయింట్ మెట్ లెటర్

బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న వివాహిత భర్తకు ఆరోగ్యం బాగా లేని కారణంగా ఆసుపత్రిలో పరిచయమైన మాల్యాద్రి ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. వివాహితకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ కుటుంబాన్ని నమ్మించాడు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం బోగస్ అపాయింట్ మెంట్ లెటర్లను ఆ వివాహిత కోసం తయారు చేశాడు. ఈ మేరకు లెటర్లను చూపి ఉద్యోగాలు వచ్చినట్టుగా నమ్మించాడు. ఓ ఆసుపత్రిలోని హెచ్‌ఆర్ నుండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఇంటర్వ్యూ కూడ మాల్యాద్రే చేసినట్టుగా విచారణలో మాల్యాద్రి ఒప్పుకొన్నాడని సమాచారం.

తప్పుడు లేఖలు

తప్పుడు లేఖలు

రెండు ఆసుపత్రులకు భర్త రాసినట్టుగా వివాహితకు వ్యతిరేకంగా తప్పుడు లేఖలను మాల్యాద్రి రాసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ లేఖలతో భార్య, భర్తల మధ్య చిచ్చు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుమానాలను రేకెత్తించాడు. భార్య, భర్తల మధ్య చిచ్చు పెట్టి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించాడు. ఈ గొడవల కారణంగా ఆ వివాహిత పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ సమయంలో భర్తను హత్య చేసేందుకు మాల్యాద్రి కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు.

ఆధారాల సేకరణ

ఆధారాల సేకరణ

వివాహితపై కన్నేసిన మాల్యాద్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బాధిత కుటుంబంతో పాటు సుపారీ తీసుకొన్న వారు కూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది. దీంతో మాల్యాద్రిని పోలీసులు మే 20వ తేదిన అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసు విషయమై విచారణ కోసం పోలీసులు కోర్టు అనుమతితో మాల్యాద్రిని కస్టడీకి తీసుకొన్నారు. ఈ కస్టడీలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. బోగస్ అపాయింట్ మెంట్ లెటర్లు, భర్త రాసినట్టుగా తప్పుడు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

English summary
Malyadri one day police custody completed on Thursday.malyadri was arrested on May 20, 2018 for sexual harassment on women in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X