• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాల్యావి మోసం .. నమ్మించి కోట్లలో టోకరా వేసి ప్రజల్ని నట్టేట ముంచిన సంస్థ

|

ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే స్వచ్చంద సంస్థలు కూడా కుప్పలు తెప్పలుగా ఇప్పుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, కుట్టు మిషన్లు ఇస్తామని ,చిరువ్యాపారులకు సబ్సిడీపై వడ్డీలేని రుణాలు ఇస్తామని, వేలాది మంది అమాయకులను మోసగించి రూ.8.10 కోట్ల కొల్లగొట్టిన మాల్యావి కరుణోదయ సొసైటీ ప్రజలకు టోకరా వేసింది.

సెల్యూట్ పోలీస్ ..చేపల కోసం బావిలోకి దిగి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడిన సిఐ

ఇళ్ళు కట్టిస్తామని డిపాజిట్లు వసూలు చేసి కోట్లకు టోకరా వేసిన మాల్యావి కరుణోదయ సొసైటీ

ఇళ్ళు కట్టిస్తామని డిపాజిట్లు వసూలు చేసి కోట్లకు టోకరా వేసిన మాల్యావి కరుణోదయ సొసైటీ

ఇక ఈ స్వచ్చంద సంస్థ చేసిన నిర్వాకం చూస్తే ఇలా కూడా మోసం చేస్తారా అనిపించక మానదు . ఖమ్మం జిల్లాకు చెంది న కొండ కిష్ణమ్మ, ఆమె భర్త రమేష్‌, ఇతర కుటుంబసభ్యులు కలిసి వృద్ధు లు, దివ్యాంగులకు సేవలు అందించే లక్ష్యంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ కేంద్రంగా ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇక ఇళ్లులేనివారికి రూ.30వేలకే రూ.7.50 లక్షల వ్యయంతో 725 చదరపు అడుగుల డబుల్‌బెడ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆకర్షణీయమైన స్కీంతో యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్ధిపేట తదితర జిల్లాల్లో కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయా మండల కేంద్రాల్లో కో-ఆర్డినేటర్లను పెట్టి కమీషన్లు ఇస్తామని చెప్పి దందా ప్రారంభించారు . రూ.30వేలు చెల్లించిన కొంతమందిని నమ్మించటానికి ఇసుక, ఇటుక, స్టీల్‌, సిమెంట్‌ వంటివి సరఫరా చేశారు . ఇక దీంతో ఈ పథకంలో చేరడానికి అప్పులు చేసి రూ.30వేల డిపాజిట్లు చెల్లించడానికి క్యూలు కట్టారు. డిపాజిట్‌ చేసిన మూడు మాసాలకు ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పడంతో కొంత మంది ఉన్న ఇంటి ని కూడా కూలగొట్టుకున్నారు. తక్కు వ కాలంలోనే 27వేల మంది రూ. 8.10 కోట్లు డిపాజిట్లు చెల్లించారు. ఇక ఇదంతా మోసం అని గ్రహించిన ఆలేరుకు చెందిన బాధితురాలు పోలీసుల ను ఆశ్రయించడంతో నిర్వాహకుల గుట్టు రట్టయింది.

చిరు వ్యాపారులు , మహిళలను సైతం మోసం చేసిన సొసైటీ

చిరు వ్యాపారులు , మహిళలను సైతం మోసం చేసిన సొసైటీ

ఇక గృహ నిర్మాణం కోసం మాత్రమే కాదు చిరువ్యాపారులు రూ.5వేలు చెల్లిస్తే రూ.లక్ష రుణం ఇస్తామని, అందులో రూ.30శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. మిగతా సొమ్మును వడ్డీ లేకుండా నెలసరి వాయిదాల్లో చెల్లించాలని చెప్పి నమ్మించారు . అదే విధంగా కేవలం రూ.3వేలు చెల్లిస్తే రూ.15 వేల విలువగల కుట్టుమిషన్‌ను ఉచితంగా ఇస్తామని డిపాజిట్లు వసూలు చేశారు. అయితే నెలలు గడిచినా ఇస్తామని చెప్పిన రుణాలు, కుట్టుమిషన్లు ఇవ్వక పోవడంతో గ్రామంలోని కో-ఆర్డినేటర్లను నిలదీస్తే గ్రామానికే చెందిన కో-ఆర్డినేటర్‌ స్వామి నలుగురుకి రూ.1లక్ష చెక్కులను అందజేశాడు. అయితే ఖాతాల్లో నగదు నిల్వ లేక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

మాల్యావి కరుణోదయ సొసైటీ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు .. లబోదిబో అంటున్న బాధితులు

మాల్యావి కరుణోదయ సొసైటీ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు .. లబోదిబో అంటున్న బాధితులు

ఇక ఇంతటి నిర్వాకం చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ పోలీసులు..మోసానికి పాల్పడిన సొసైటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొండ కృష్ణమ్మతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు జనగామ, సిద్ధిపేట తదితర జిల్లాలకు చెందిన వేలాది మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాము మోసపోయామని లబోదిబో అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bhongir police's Special Operations Team (SOT) in Telangana on Saturday uncovered a racket with the arrest of 30-year-old Konda Krishnamma, who allegedly cheated several people of Rs 8 crore, after promising to provide them with 2BHK houses. Her associates were also arrested in connection to the incident.The police said that Krishnamma was the chairperson of a foundation, Malyavai Karunodaya Society for the old and persons with physical disabilities, and had allegedly collected around Rs 30,000 each from several people, promising them a fully-constructed 2BHK house within six months. However, she failed to deliver on her promise, The police said that the accused ran an elaborate racket in this manner and collected more than Rs 8 crore from over 2,700 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more